చంద్రబాబు నాయుడి హయాంలో బాదుడే - బాదుడు


స్వార్థం కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు.
 నాలుగేళ్లు సాగిలపడి ఇప్పుడు కోర్టు కెళతామనడం కొత్త ఎత్తుగడ
ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తున్నారు

చిత్తూరు జిల్లా కాళహస్తి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న  ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదివారం నాడు నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు.  ఈ సందర్భంగా ప్రభుత్వ పనితీరుపైనా, ముఖ్యమంత్రి వ్యవహారశైలిపైనా  మండిపడ్డారు .

ఆయన ప్రసంగంలోని ముఖ్యమైన అంశాలేమిటంటే...

నా భుజం తడుతూ నన్ను నడిపించారు. ఎండలో ఇలా నిలుచోవాల్సిన అవసరం లేకున్నా నడిరోడ్డుపైనే నిలుచుని ఎదురు చూస్తున్న వారందరి ప్రేమానురాగాలకు ఆత్మీయతలకు కృతజ్ఞతలు.

ఎన్నికలకు ముందు నాలుగేళ్ల పాలన చూశారు. మరో సంవత్సరంలో ఎన్నికలు జరగనున్నాయని చంద్రబాబు చెపుతున్నారు. ఈ నాలుగేళ్ల పాలనలో మీలో ఎవరైనా సంతోషంగా ఉన్నారా? అని అడుగుతుంటే....ఇలా...ఇలా రెండు చేతులూ పైకెత్తి లేదంటూ సమాధానమిచ్చారు.

ఏ ఒక్కరు కూడా సంతోషంగా లేరు. రైతన్నలు, అవ్వాతాతలు, అక్కా చెల్లెమ్మలు, చదువుకునే పిల్లలు చదువైపోయిన యువకులు
సంతోషంగా లేరు. 

శ్రీకాళహస్తికి  40 కిలోమీటర్ల దూరంలో మన్న వరం ప్రాజెక్టు కనిపిస్తోది. నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్న ప్పుడు మూడు రాష్ట్రాలు పోటీ పడినప్పటికీ  రాజశేఖరరెడ్డి గారి చొరవ వల్ల 6 వేల కోట్ల విలువైన ప్రాజెక్టు మన్నవరంకు వచ్చింది. 

 6100 మందికి ఉద్యోగాలు ఇచ్చే ప్రాజెక్టు అది, నాన్నగారు చనిపోయిన తరువాత దాని పరిస్థితి ఏమిటి?  నాలుగేళల్లో ఆ సంఖ్య 12 వందలకు, ఆ తరువాత 3 వందలకు తగ్గించారు ఇప్పుడు కేవలం వంద మంది మాత్రమే పనిచేస్తున్నారు వారిలో మన రాష్ట్రానికి  చెందిన వారు కేవలం 20 మంది సెక్యూరిటీ గార్డులుగా పని చేస్తున్నారు. 

చంద్రబాబు ప్రతి సంవత్సరం ఎక్కడికి పోతారు ,నల్లధనాన్ని దాచుకునేందుకు స్విట్జర్లాండు, సింగపూరుల తోపాటు జపాన్‌ , చైనా వంటి దేశాలకు పోతాడు, వాటికి మామూలు విమానాల్లో పోడు, ప్రైవేటు విమానాల్లో పోతాడు. 

ఇలా వెళ్లే బదులు ఇక్కడే ఉంటూ మన్నవరం ప్రాజెక్టు పై శ్రద్ధ చూపితే , ఈ పాటికి పూర్తి అయి 6 వేల మందికి ఉద్యోగాలు వస్తాయి.

ఏ దేశానికి వెళితే, ఆ దేశంలా రాష్ట్రాన్ని తయారు చేస్తానంటున్న చంద్రబాబు నాయుడు , చిత్తూరు జిల్లాకు సమద్రున్నా తెస్తానన్నా ఆశ్చర్యం లేదంటూ చంద్రబాబు శైలిపై మండిపడ్డారు.

విదేశాలకు వెళ్లి వచ్చినప్పుడల్లా లక్షల కోట్లపెట్టుబడితో వేల పరిశ్రమలు వస్తున్నాయని ప్రకటిస్తున్నారు అవన్నీ దేవుడెరుగన్నారు. వీటితో పాటు వస్తాయంటున్న  లక్షల ఉద్యోగాల సంగతి దేవుడికే ఎరుకని వైయస్‌ జగన్‌ అన్నారు.

చిత్తూరు జిల్లాలో చిత్తూరు జిల్లాలో దాదాపు 5 వందలకు పైగా గ్రైనేటు ఫ్యాక్టరీలు ఉన్నాయి, చంద్రబాబు వచ్చిన తరువాత వాటిపై ఛార్జీల భారాన్ని మోపడంతో, అవన్నీ మూతపడి, వేలాది మంది కార్మికులు రోడ్డున పడే పరిస్థితులు దాపురించాయి.

అలాగే చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే  జిల్లాలోని సహకార సంఘాల చక్కెర ఫ్యాక్టరీలు మూత పడతాయి. గతంలో వైయస్‌ రాజశేఖరరెడ్డి గారు 51 కోట్ల కేటాయింపులు చేసి పునరుద్ధరించారు. నాన్నగారి పుణ్యాన పదేళ్లుగా రైతులు సంతోషంగా ఉన్నారు. సహకార రంగంలో ఫ్యాక్టరీ ఉంటే చెరుకు రైతులకు అదొక భరోసా. మంచి రేటు ఇవ్వాలని చూస్తుంది. 
చంద్రబాబు నాయుడు రైతుల గురించి ఆలోచించరు. సహకార ఫ్యాక్టరీలు  మూతపడటంతో రైతులు అల్లాడుతున్నారు. రైతులు చెరుకు అమ్ముకోలేని  పరిస్థితి. విచిత్రంగా జిల్లాలో ఉన్న 4 ప్రైవేటు ఫ్యాక్టరీలు లాభదాయకంగా నడుస్తుంటే కేవలం సహకార ఫ్యాక్టరీలే మూతపడ్డాయంటే చంద్రబాబు వైఖరి ఏమిటో అర్థం అవుతోంది.
ప్రైవేటు ఫ్యాక్టరీలు ఇచ్చే రేటు గిట్టుబాటు కాక  చెరుకు రైతులు బెల్లం తయారు చేస్తే, దానిపై కూడా ఆంక్షలు పెట్టారు.

చిత్తూరు డైరీ ఫ్యాక్టీరీ ఉంది. రైతులందరూ పాలు అమ్ముకోడానికి తోడుగా ఉండేది. దీనిని‡ ఒక పథకం ప్రకారం ముఖ్యమంత్రి కాగానే చంద్రబాబు దానిని మూసివేయించారు. హెరిటేజ్‌ సంస్థ లాభాల కోసమే ఇలా చేశారు.

రాయలసీమ, నెల్లూరు జిల్లాలను శస్యశ్యామలం అయ్యేందుకు ఉద్దేశించిన సోమశిల–స్వర్ణముఖి, గాలేరు–నగరి వంటి ప్రాజెక్టుల పనులను మహానేత వైయస్‌ ఆర్‌ గారి హయాంలోనే 70–80 శాతం పూర్తి చేసినా మిగిలిన పనులపై చంద్రబాబు ఏమాత్రం దృష్టి పెట్టడం లేదు.

చంద్రబాబునాయుడి హయాంలో కరెంటు బిల్లులు షాక్‌ కొడుతున్నాయి. గతంలో 50–100 వచ్చే బిల్లులు ఇప్పుడు 400– 1000 వరకు వస్తున్నాయి. 
దేశంలో ఎక్కడా లేనట్లుగా పెట్రో ధరలు మండి పోతున్నాయి. పొరుగు రాష్ట్రాల కంటే 6,7 రూపాయల అధికంగా ధరలు అమలు చేస్తున్నారు. బిల్లులు తగ్గిస్తామంటూ ఎన్నికల ముందు ఊదరగొట్టి, షాక్‌ కొట్టే స్థాయికి తీసుకుని వచ్చారు.

అలాగే ఆర్టీసీ ఛార్జీలను పెంచి, పండుగల సమయంలో బస్సు అంటేనే భయపడే స్థాయికి తీసుకుని వచ్చారు.

రేషన్‌ షాపుల్లో దొరికే వస్తువులన్నిటిని తగ్గిస్తూ, ఇప్పుడు మీకు బియ్యం తప్ప మరోటి లేని పరిస్థితిని తీసుకుని వచ్చారు.ఇదిó∙చంద్రబాబు నాయుడి పాలన 

ఎన్నికల హామీలకు తూట్లు

ఎన్నికల హామీలకు సంబంధించిన ఈ పెద్ద మనిషి ఏమేరకు చేశారు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు.
 బ్యాంకుల్లో పెటిన బంగారం ఇంటికి రావాలంటే , బాబు ముఖ్య మంత్రి కావాలన్నారు. వ్యవసాయ రుణాలు 12 వేల కోట్ల మఫీ కావాలన్నారు. ఏ ఒక్కరికైనా బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రాలేదు,కానీ బ్యాంకులు తెచ్చిన రుణ నోటీసులు వస్తున్నాయి. ఈ రుణమాఫీ వడ్డీలకు కూడా సరిపోని విధంగా అమలు చేస్తున్నారు.
పొదుపు సంఘాల రుణాలు మాఫీ 4 ఏళ్ల తరువాత అడుగుతున్నా కనీసం ఒక్క Æ] ూపాయి కూడా మాఫీ కాలేదు. 
ఇదే పెద్ద మనిషి ఆరోజు  ఏమన్నాడు. ప్రతి పెదవాడి 3 సెంట్ల స్థలం, ఇంటిన కట్టిస్తానన్నాడు, ఒక్క ఇళ్లన్నా కట్టించారా అని అడుగుతున్నాంటూ  ప్రశ్నించారు. 
ఎన్నికలప్పుడు జాబు కావాలంటే, బాబు రావాలంటూò ప్రతి ఇంటికీ కార్యకర్తలను పంపించి, ఉద్యోగం, లేకుంటే 2 వేలుఇస్తానన్నాడు. 45 నెలలు ప్రతి ఇంటికి 90 వేలు బాకీ పడ్డారా లేదా ?చంద్రబాబు 90 వేలు ఏమిటని గట్టిగా అడగండి.

ఎన్నికలు వస్తున్నాయంటే మళ్లీ హామీలు మొదలెట్టారు

ఎన్నికలప్పుడే చంద్రబాబుకు ప్రజలు గుర్తుకు వస్తారు. నాలుగేళ్ల తరువాత ఇంకా లక్షలాది మందికి ఫించన్‌లు ఇవ్వాల్సి ఉందని చంద్రబాబుకు గుర్తుకు వచ్చింది. 
హైదరాబాద్‌ లో ఆరోగ్య శ్రీ వర్తించడం లేదన్న సంగతి జ్ఞాపకం వచ్చింది.
ప్రతి ఒక్కరికి ఇళ్లు కట్టిస్తాన్న మాట మరచి, ఇప్పుడు ఏడాదిలో 10 లక్షల ఇళ్లు కట్టిస్తానంటున్నారు. ఆయన వరస చూస్తుంటే, తల్లికి అన్నం పెట్టని వాడు అన్న సామెత గుర్తుకు వస్తోంది.

నాలుగేళ్లుగా ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి, కేంద్ర ముందు సాగిలపడి ఇప్పుడు కోర్టుకు వెళతారట ఇంతకంటే మోసం ఏముంది?
ఆయన భాగస్వామ్యంలో ఉన్న ప్రభుత్వంపై ఆయన కోర్టుకు వెళతామంటూ, ఎవరిని దగా చేస్తున్నారు. ప్రజలను మభ్యపెట్టేందుకు మరో కొత్త ఎత్తుగడలే ఇవి.

ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని తూట్లుపొడుస్తున్నారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను 20,30 కోట్లుకు కొనుగోలు చేయడమే కాకుండా, వారికి మంత్రి పదవులు ఇస్తారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ అడ్డంగా దొరికినా చలించరు.తన షూటింగ్‌ కోసం పుష్కరాల్లో అమాయకుల ప్రాణాలు తీసినా ఇచ్చినా కేసులుండవు, స్మగ్లర్లంటూ 21 మంది కూలీలను కాల్చి చంపినా కేసులుండవు.

ఇటువంటి పోకడలు పోయి, రాజకీయాల్లో విశ్వసనీయత పెరిగి, ఎన్నికల హామీలను నెరవేర్చని నాడు రాజీనామా చేసి వెళ్లిపోయే స్థితి రావాలి. అంటూ నవరత్నాల్ల ో భాగంగా ప్రకటించిన పిల్లలు చదువులు గురించి చేపట్టనున్న కార్యక్రమాలను వివరించారు.


తాజా ఫోటోలు

Back to Top