రైతులను నట్టేట ముంచిన చంద్రబాబు

చిత్తూరు : అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే హంద్రీ నీవా ప్రాజెక్టు ద్వారా  నీళ్లు ఇస్తామని ప్రజలకు మాట ఇచ్చిన చంద్రబాబు నాయుడు నాలుగేళ్లయినా దానిని నిలబెట్టుకోలేకోపోయారని వైయస్ ఆర్ సీపీ ఎంపి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి విమర్శించారు. అబద్దపు హామీలతో రైతులను నట్టేట ముంచారన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
 హంద్రీనీవా ప్రాజెక్టును వైఎస్‌ రాజశేఖరరెడ్డి 80 శాతం పూర్తిచేస్తే మిగిలిన 20 శాతం పనులను కూడా చంద్రబాబు పూర్తిచేయలేకపోయారని తెలిపారు. 
ప్రజాసంకల్పయాత్రలో భాగంగా చిత్తూరు జిల్లాలో వైఎస్‌ జగన్‌ చేస్తున్న పాదయాత్ర రోజు రోజుకు ప్రజల మద్దతు పెరుగుతోందని మిథున్‌రెడ్డి తెలిపారు. సీఎం చంద్రబాబు సొంత జిల్లాలోనే వైఎస్‌ జగన్‌కు వస్తున్న ఆదరణ చూసి టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని ఎద్దేవా చేశారు.  
Back to Top