అంబేద్కర్‌ని సైతం మోసం చేసిన బాబు


125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహం ఏదీ?
రూ.190 కోట్లతో ఇచ్చిన జీవోలు ఏమయ్యాయి 
వైయస్‌ఆర్‌ సీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున
మాట నిలబెట్టుకోవాలని శాకమూరులో వైయస్‌ఆర్‌ సీపీ మౌనదీక్ష
అత్యుత్సాహంతో వైయస్‌ఆర్‌ సీపీ నేతలను అరెస్టు చేసిన పోలీసులు

గుంటూరు: ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవడంలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున ధ్వజమెత్తారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహ ఏర్పాటు అలసత్వంపై వైయస్‌ఆర్‌ సీపీ ఆందోళనకు దిగింది. తూళ్లురు మండలం శాఖమూరులో 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ హామీని అమలు చేయాలని వైయస్‌ఆర్‌ సీపీ నేతలు మౌనదీక్షకు సిద్ధమయ్యారు. మౌనదీక్షకు వెళ్తున్న మేరుగ నాగార్జునను పోలీసులు అడ్డుకున్నారు. ఆయన ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. అంతేకాకుండా శాకమూరులో నాగార్జున సహా పలువురు నేతలను పోలీసులు అరెస్టు చేసి తూళ్లురు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా మేరుగ మాట్లాడుతూ... 2016 ఏప్రిల్‌ 14న 22 ఎకరాల్లో అంబేద్కర్‌ స్మృతివనం ఏర్పాటు చేస్తామన్నాడు.. 2017లో శిలాఫలకం వేశాడు.. రూ. 199 కోట్లు వెచ్చించాడు.. ఇప్పటికీ టెండర్‌ లేదు.. దళితులపై దాడులు చేయిస్తూ వారి చట్టాలను నిర్వీర్యం చేస్తున్నారు. ఇలా దళితులను మోసం చేస్తున్న చంద్రబాబు.. చివరకు దళితుల దేవుడు అంబేద్కర్‌ను కూడా మోసం చేస్తున్నాడని ధ్వజమెత్తారు. 

దళితుల్లో ఎవరు పుడతారు.. దళితుల ఆలోచనలు మురికివని చెప్పిన చంద్రబాబు క్యాబినెట్‌ దళితులకు న్యాయం ఎలా చేస్తుందని ప్రశ్నించారు. మహిళలు, చిన్నారులపై దాడులు జరుగుతుంటే.. పోలీసులను ఉపయోగించలేని చంద్రబాబు.. న్యాయం కోసం పోరాడేవారిని అణగదొక్కేందుకు చూస్తున్నారన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌ చేస్తున్న పోరాటం దళితుల పక్షాన నిలుస్తుందని, దళితులను గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అంబేద్కర్‌ వాదం అంటే డబ్బులతో కొనుక్కోవచ్చు అనుకునే చంద్రబాబుకు తగిన గుణపాఠం తప్పదన్నారు. 
Back to Top