న్యాయవాదులను కూడా మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు

లాయర్లకు
స్థలాలు కేటాయిస్తాం

అడ్వకేట్లుగా
ఎన్ రోల్ అయిన వారికి 5 వేలు స్టైఫెండ్

అధికారంలోకి
రాగానే 100 కోట్లతో సంక్షేమ నిధి

ప్రతిపక్ష
నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి

 

గుడివాడ:  న్యాయవాదలో
వృత్తిలోకి కొత్తగా అడుగుడిన వారు నిలదొక్కుకునేందుకు వీలుగా అధికారంలోకి వచ్చిన వెంటనే ,  5 వేల రూపాయల
స్టైఫెండ్ ను ఇస్తామని , అలాగే న్యాయవాదులు మరణిస్తే ప్రస్తుతం లభించే ఆర్ధిక సహాయాన్ని
4 లక్షల  నుంచి 10 లక్షలకు పెంచుతామని ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు.
ప్రజా సంకల్పయాత్ర లో భాగంగా గుడివాడ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న ఆయన  ఆదివారం సాయంత్రం కౌతవరంలో జిల్లాకు చెందిన
అడ్వకేట్లతో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు
ఎన్నికలకు ముందు  ఏ వర్గాన్ని కూడా వదిలిపెట్టలేదన్న  విషయం
అడ్వకేట్ల సమస్యలను వింటే మరోసారి 
తేటతెల్లం అవుతోందన్నారు. చంద్రబాబు సమాజంలోని ప్రతి ఒక్కరిని మోసం చేసారనీ, ఆఖరికి
అడ్వకేట్లను కూడా అడ్డగోలుగా మోసం చేయలగలిగిన గొప్ప వ్యక్తి చంద్రబాబు అని
స్పష్టంగా అర్థం అవుతోందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లే అడ్వకేట్ల
సంక్షేమం కోసం వంద కోట్ల తో నిధిని ఏర్పాటు చేస్తామంటూ హామీ ఇచ్చారు. అలాగే హైకోర్టు
ఏర్పాటైన తరువాత దాని పరిసర ప్రాంతాల్లో అడ్వకేట్లకు వీలైనంత తక్కువ ధరలకు స్థలాలు
లభించేలా చూస్తానంటూ భరోసా ఇచ్చారు. అంతకు ముందు అడ్వకేట్లు తమ సమస్యలపై ప్రతిపక్ష
నాయకుడికి విజ్ఞాపన పత్రాన్ని సమర్పించారు. కొత్తగా న్యాయవాద వృత్తిలోకి వచ్చే
వారు, కొన్నేళ్ల పాటు కేసులనేవి రాక ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్న వైనాన్ని,  సబ్ ఆర్డినేట్ కోర్టుల్లో ఉన్న ఖాళీలు ఇతరత్రా
సమస్యలను వాటిలో ప్రస్తావించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సమస్యల పరిష్కారానికి
చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.


Back to Top