బీసీలను మోసం చేసింది చంద్రబాబే



బడుగు, బలహీనులంటే చంద్రబాబు గౌరవం లేదు
వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
మదనపల్లిలో వైయస్‌ఆర్‌ సీపీ ఆధ్వర్యంలో బీసీ సదస్సు

చిత్తూరు: బడుగు, బలహీనవర్గాల అభివృద్ధిని చంద్రబాబు నీరుగార్చాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబు బీసీలంటే గౌరవం లేదన్నారు. వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే దేశాయి తిప్పారెడ్డి ఆధ్వర్యంలో మదనపల్లిలోని నీరుగట్టువారిపల్లెలోని చౌడేశ్వరి కల్యాణ మండపంలో రాజంపేట పార్లమెంట్‌ పరిధిలోని మదనపల్లి, తంబళ్లపల్లె, పీలేరు, పుంగనూరు నియోజకవర్గాలకు సంబంధించి బీసీ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, రాజంపేట పార్లమెంట్‌ ఇన్‌చార్జి ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, సీనియర్‌ నేత ద్వారకానాథ్‌రెడ్డిలు హాజరయ్యారు. సదస్సులో బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలు, పరిష్కార మార్గాలు, ఆర్థిక స్థితిగతులు, రాజకీయ ప్రాధాన్యం, బీసీ డిక్లరేషన్‌లో చర్చించాల్సిన అంశాలపై ప్రస్తావించారు. సదస్సులో నిర్ణయించిన అంశాలను, నాయకుల అభిప్రాయాలను ప్రజా సంకల్పయాత్రలో భాగంగా జరుపనున్న బీసీ గర్జన సభలో ప్రస్తావించి మేనిఫెస్టోలో పెట్టనున్నట్లు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు
Back to Top