బాబు..మంత్రగాళ్లను మించిన మాయగాడు, మోసగాడు:భూమన

హైదరాబాద్ః బ్యాంకుల్లో ఉన్న బంగారం ఇప్పిస్తా, రుణాలన్నీ మాఫీ చేస్తానని చెప్పిన చంద్రబాబు..ఏ ఒక్కరికీ మాఫీ చేయకుండానే చేశానని చెప్పడం సిగ్గుచేటని వైయస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. 87 వేల కోట్ల అప్పును బాబు లక్ష 10 కోట్లకు చేశారు తప్ప...రుణాలు మాఫీ చేసిన పాపాన పోలేదన్నారు. బాబు లాంటి మోసగాడు మరొకరు ఉండరని భూమన ఫైర్ అయ్యారు.  మంత్రగాళ్లను మించిన మాయగాడు చంద్రబాబు అని భూమన నిప్పులు చెరిగారు. ఎన్నికల్లో  వందలాది వాగ్ధానాలు ఇచ్చిన చంద్రబాబు ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు . ప్రజలకు చేసిందేమీ లేకపోగా....వారిని మరోసారి మభ్యపెట్టి మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు ఊకదంపుడు ఉపన్యాసాలు వినలేక ప్రజలు టీవీలు కట్టేసి పారిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. 

Back to Top