అబద్ధాలు చెప్పడంలో బాబు గోబెల్స్‌ను మించాడు

నెల్లూరు: ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అబద్ధాలు చెప్పడంలో గోబెల్స్‌ను మించిపోయాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయ వ్యవహారాల కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వాస్తవాలు కప్పిపుచ్చి అబద్ధాలు చెప్పడంలో దిట్ట అని విమర్శించారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎప్పటికప్పుడు అభిప్రాయం మార్చుకుంటూ యూటర్న్‌ తీసుకోవడంతో ముందుండే వ్యక్తి చంద్రబాబు అన్నారు. వైయస్‌ జగన్‌ తన నాయకత్వ పటిమతో ప్రత్యేక హోదా కోసం దేశమంతా చర్చ జరిగేలా చేశారన్నారు. వైయస్‌ జగన్‌ ఆదేశాల మేరకు హోదా కోసం వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీలు రాజీనామాలు చేస్తే టీడీపీ ఎంపీలు డ్రామాలు ఆడుతున్నారన్నారు. నాలుగేళ్లుగా హోదాను భూస్థాపితం చేసేందుకు ప్రయత్నించిన చంద్రబాబు ఇప్పుడు తానే ఛాంపియన్‌ అన్నట్లుగా ప్రచారం చేసుకుంటూ మరోసారి ప్రజలను మభ్యపెట్టేందుకు చూస్తున్నారన్నారు. రాజకీయాల్లో విలువల కోసం తపించే నాయకుడు వైయస్‌ జగన్‌ అని చెప్పారు. 40 సంవత్సరాల అనుభవం కలిగిన తన స్వార్థ ప్రయోజనాల కోసం విలువలను పాతరేస్తున్న వ్యక్తి చంద్రబాబు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
Back to Top