చంద్ర‌బాబు ఒక ఊస‌ర‌వెల్లి..!

హైదరాబాద్)) చంద్రబాబు మోసాలు ప్రజలకు తెలిసిపోయాయని, అయినా సరే, వాటిని
దాచిపెట్టాలనుకోవటం మూర్ఖత్వం అని మాజీమంత్రి, వైయస్సార్సీపీ సీనియర్ నేత బొత్సా
సత్యనారాయణ అభిప్రాయ పడ్డారు. హైదరాబాద్ లోటస్ పాండ్ లోని పార్టీ కేంద్ర
కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బొత్సా ఏమన్నారో ఆయన మాటల్లోనే...

() ఇక్క‌డ పార్టీలు,
పార్టీలు గొడ‌వ
ప‌డ‌టంతో స‌మ‌స్య ప‌రిష్కారం కాద‌ని కేంద్రంతో పోరాడి ప్ర‌త్యేక హోదా తేవ‌డమే మ‌న
అంతిమ ల‌క్ష్యం. ఆ విష‌యాన్ని ప‌క్క‌నపెట్టి ఎందాకా ప్ర‌తిప‌క్ష‌ పార్టీల కార్య‌క్ర‌మాల‌ను
ఎలా త‌క్కువ చెయ్యాలా అని చంద్ర‌బాబు చూస్తున్నారు.

() పార్ట‌మెంటులో వైయ‌స్ఆర్ సీపీ ఎంపీలు ఆందోళ‌న‌లు చేస్తుంటే టీడీపీ ఎంపీలు
మాత్రం సినిమా చూస్తున్న‌ట్టు కూర్చోవ‌డం చాలా బాధాక‌రం.

() ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నా ర‌క్తం మ‌రిగిపోతోంది అంటూ ప్ర‌క‌ట‌న‌లైతే
చేశారు కానీ ఆయ‌న అలా ఆవేశంగా ఉన్న‌ట్టు ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. ప్ర‌జ‌లు సరైన
సౌక‌ర్యాలు లేక ఇబ్బందులు ప‌డుతుంటే చంద్ర‌బాబు ఇలా కాల‌క్షేపం చేయ‌డం ప‌ద్ద‌తి
కాదు

() కేంద్రాన్ని ప్ర‌తిప‌క్షం ప్ర‌శ్నించ‌డం లేదు అంటూ కేంద్రానికి తెలిసేలా
ప్ర‌తిప‌క్షం చేస్తున్న బంద్ లో మాత్రం  ధ‌ర్నా వ‌ల్ల రాష్ట్రంలో రూ. 5 ల‌క్ష‌ల కోట్లు న‌ష్టం అన‌డం  అమానుషం .   చంద్ర‌బాబు ప్రతిప‌క్షం లో ఉన్న‌ప్పుడు
చేసిన బంద్ ల స‌మ‌యంలో ఈ ఆదాయం గుర్తురాలేదా  

() చంద్ర‌బాబు మాట్లాడుతూ `ఎక్క‌డైనా సీఎంపై సీబీఐ కేసులు వేస్తారా`.. అంటూ స‌న్నాయి నొక్కులు  నొక్క‌కుండా నిజంగా భయం లేకుంటే `నేనేం త‌ప్పు చెయ్య‌లేదు ఎవ‌రైనా ఎంక్వైరీ` చెయ్య‌నివ్వండి అని చెప్పేవారు.

()  అరుణ్ జైట్లీతో చంద్ర‌బాబు చేతులు
క‌లిపి ఏదో కుట్ర‌లు చేస్తున్నారు. చంద్ర‌బాబు ఊస‌ర‌ వెల్లిలా మాట‌లు మార్చుతూ ప్ర‌త్యేక
హోదాను కేంద్రం వ‌ద్ద తాక‌ట్టు పెట్టారు.

()  టీడీపీ ఎంపీ సుజ‌నా చౌద‌రి మేం పోరాటానికి  వ్య‌తిరేకం కాదు అన్నారు, అశోక్ గ‌జ‌ప‌తిరాజు  బిల్ పెట్టండి స‌పోర్ట్
చేస్తాం అంటున్నారే త‌ప్ప చేసిందేమీ లేద‌ని, అంద‌రూ క‌ల‌సి తెలుగు ప్ర‌జ‌ల‌ను మోసం
చేస్తున్నారు.

() పుష్క‌రాల కోసం కేంద్ర‌పెద్ద‌ల‌ను ఆహ్వానించాడానికి డిల్లీ వెళ్తున్నా ప‌నిలో
ప‌ని గా ప్ర‌త్యేక హోదా గురించి కూడా మాట్లాడుతా అని చంద్ర‌బాబు అన‌డంలోనే
తెలుస్తోంది ఆయ‌న ప్ర‌త్యేక హోదాకు ఎంత విలువ ఇస్తున్నారో.

()  మిత్ర‌ప‌క్ష హోదాలో అమ‌రావ‌తి
పేరిట డ‌బ్బుల నొక్క‌డం,
ఇంకా ఓటుకు నోటు
కేసును దాచిపెట్ట‌డం లాంటివి సాగించుకు పోతున్నారు. ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు.
తప్పకుండా బుద్ధి చెబుతారు.

 

అని బొత్సా సత్యనారాయణ సూటిగా అభిప్రాయాలు వెల్లడించారు.

 

 

Back to Top