సులువుగా మాటలు మార్చగల ఘనడు బాబు

నిన్న రాత్రి సీఎం ప్రత్యేకంగా ప్రెస్‌ మీట్‌ పెట్టి ఎన్నో ఘోరాలు జరగబోతుంటే ఆపామటూ గంట పాటు మెత్తని మాటలతో చేసిన వ్యాఖ్యలపై వైయస్సార్సీపీ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. వైయస్సార్సీపీ శాంతియుతంగా కొవ్వొత్తుల ర్యాలీకి పిలుపునిస్తే, దాన్ని అడ్డుకోవడమే గాకుండా చంద్రబాబు తానేదో నీతివంతుడిలా మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. వైయస్ జగన్ ను రన్‌వే పైనే ఆపడంపై ఉద్దేశం ఏమిటి...? పోలీసులెవరు..? ప్రతిపక్ష నాయకుడిని ఎందుకు ఆపారు. ఆర్కే బీచ్‌ను కర్ఫ్యూ ఎందుకు పెట్టాల్సి వచ్చిందని ప్రశ్నించారు. ఎన్టీఆర్ ను తప్పించి నాయకుడైన చంద్రబాబు సులువుగా మాటలు మార్చగల దిట్ట అని ఎద్దేవా చేశారు

Back to Top