ఏపీలో బాబు బ్రీఫుడ్ మీ పాలసీ

  • మూడు ఎమ్మెల్సీలకు రూ.300 కోట్లు ఖర్చు
  • అసెంబ్లీని వదిలి మంత్రుల క్యాంపు రాజకీయాలు
  • మండలి ఎన్నికల్లో టీడీపీ ప్రలోభాలు, కొనుగోళ్లు
అమరావతి: ఏపీలో నిర్వహించిన మూడు స్థానిక సంస్థల ఎన్నికలకు టీడీపీ రూ.300 కోట్లు ఖర్చు చేసిందని, ఇది చంద్రబాబు సాధించిన ఘనత అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా విమర్శించారు. ఇలా గెలవడం కూడా ఓ గెలుపేనా అని ఆమె ఎద్దేవా చేశారు. శాసన మండలి ఎన్నికల ఫలితాలపై రోజా స్పందించారు. ఓట్లకు కోట్లు కేసులో చంద్రబాబుకు శిక్ష పడకపోవడం వల్లే మళ్లీ ఆయన శాసన మండలి ఎన్నికల్లో డబ్బులు ఖర్చు చేసి గెలుపొందారని మండిపడ్డారు. కర్నూలు, కడప, నెల్లూరు జిల్లాల్లో నైతికంగా వైయస్‌ఆర్‌సీపీ గెలిచిందన్నారు. ఏపీలో బ్రీప్డ్‌మీ పాలసీని అమలు చేశారు. బలం లేకపోయిన బరితెగించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ వ్యవస్థ వేస్టు అన్న చంద్రబాబు ఈ రోజు వారి ఓట్లతోనే గెలుపొందారని గుర్తు చేశారు. రాష్ట్రం విడిపోయి నష్టాల్లో ఉంటే మంత్రులు అచ్చెన్నాయుడు, గంటా, రావెల, నారాయణ అసెంబ్లీని వదిలి క్యాంపు రాజకీయాలకు తెర లేపారని విమర్శించారు. నారాయణ సిగ్గుపడాల్సిన రోజు ఇది.  నారాయణ విద్యా సంస్థలో టెన్త్‌ పేపర్‌ లీక్‌ చేశారని రోజా దుయ్యబట్టారు. 

కర్నూలు జిల్లాలో 5 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినా, రూ.145 కోట్లు ఖర్చు చేసిన శిల్పా చక్రపాణి రెడ్డి 61 ఓట్లతో గెలుపొందడం ఓ గెలుపేనా? అని ప్రశ్నించారు. మీరు ఎన్ని కోట్లతో ప్రలోభపెట్టినా టీడీపీ మెజారిటీ తగ్గిండం ఈ ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తుందన్నారు. దిగజారుడు రాజకీయాలు చేస్తున్న మీరు వైయస్‌ జగన్‌ను హేళన చేస్తు మాట్లాడటం సిగ్గు చేటన్నారు. పవన్‌ కాళ్లు పట్టుకొని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు వైయస్‌ జగన్‌ను విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. వైయస్‌ జగన్‌ సింహం లాంటి వారని,  సింగిల్‌గా వచ్చారని చెప్పారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లే సత్తా మీకు లేదని ధ్వజమెత్తారు. మీ కుమారుడు లోకేష్‌ను దొడ్డిదారిలో ఎమ్మెల్సీగా సభలోకి తీసుకొచ్చారు, మీలాంటి పార్టీకి ప్రజలు బుద్ధి చెబుతారని రోజా హెచ్చరించారు.
Back to Top