అది బాబు అవివేకం

చుండూరు (అమృతలూరు) : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపును ముఖ్యమంత్రి చంద్రబాబు విజయంగా భావించటం అవివేకమని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి కొండమడుగుల సుధాకర్‌రెడ్డి అన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌ మాట్లాడుతూ... అధికారంలో ఉన్నామనే అహంకారంతో విచ్చలవిడిగా చంద్రబాబు నాయుడు స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోట్ల రూపాయలు ఖర్చు చేశారని, ఒక్కో ఎంపీటీసీ, జెడ్పీటీసీకి రూ. 30 లక్షల వరకు ఇచ్చి సంతలో గొర్రెల‌ను కొన్నట్టు కొనుగోలు చేశారని విమర్శించారు. అధికార మదంతో చంద్రబాబు ఓటర్లను ప్రలోభ పెట్టి గెలిచారని విమర్శించారు. దీన్ని కూడా వారు ఘనతగా తీసుకోవటం హాస్యాస్ప‌ద‌మ‌ని ఎద్దేవా చేశారు.  చంద్రబాబుకు తన పాలనపై ఏమాత్రం నమ్మకం ఉన్నా.. వైయ‌స్ఆర్ సీపీ నుంచి ప్ర‌లోభాల‌తో టీడీపీలోకి లాక్కున్న ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసి ఎన్నికలకు వెళ్లాలని సవాల్‌ విసిరారు. స్థానిక‌ సంస్థల ఎన్నికల్లో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీదే నైతిక గెలుపని అన్నారు.

Back to Top