బీజేపీతో జతకట్టి చంద్రబాబు నిలువునా ముంచాడు..

కాకినాడః ఏపీకి ప్రత్యేకహోదా వస్తే రాష్ట్రం సర్వోతోముఖాభివృద్ధి జరిగిందేని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత మేకపాటి రాజమోహన్‌ రెడ్డి అన్నారు. కాకినాడలో వంచనపై గర్జన దీక్ష కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట విభజన సమయంలో ఏపీ పూర్తిగా నష్టపోయిందని, ఆ నష్టాన్ని పూడ్చడానికి కొన్ని అంశాలను అప్పటి ప్రధాని మనోహ్మన్‌ సింగ్‌ విభజన చట్టంలో పొందుపరిచారన్నారు.  ప్రత్యేకహోదా,విశాఖరైల్వే జోన్,విశాఖపెట్రో కెమికల్‌ కాంప్లెక్స్,విశాఖపట్నం–చెన్నై ఇండస్ట్రియల్‌ కారిడార్,దుగరాజపట్నం సీపోర్టు,కడప స్టీల్‌ప్లాంట్‌ వంటివి విభజన చట్టంలో పెట్టారన్నారు. ఐదు సంవత్సరాలు ప్రత్యేకహోదా ఇస్తామన్నారని తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నా  బీజేపీ తగదు కనీసం 10 సంవత్సరాలైన ఇవ్వాలని కోరిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత పది సంవత్సరాలు ప్రత్యేకహోదా ఇస్తామని బీజేపీ హామీ ఇచ్చిందన్నారు. ఏపీ ప్రజలు అందరూ నమ్మి ఓటు వేశారన్నారు. రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని ప్రజలు అనుకున్నారని చివరికి చంద్రబాబు, మోదీ కలిసి రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశారని మండిపడ్డారు. ప్రత్యేకహోదా వస్తే పా్రరిశామికంగా రాష్ట్రం అభివృద్ధి జరిగి ఉండేందని అన్నారు. రాయలసీమ,ఉత్తరాంధ్ర గొప్పగా అభివృద్ధి చెంది ఉండేవి.స్వార్థ ప్రయోజనాలు కోసం చంద్రబాబు బీజేపీతో జతకట్టి నిలువునా ముంచారన్నారు.
Back to Top