రాష్ట్ర అభివృద్ధిని నిలువునా ముంచిన ద్రోహి చంద్రబాబు

అనంతపురం: ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీ మేలని ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధిని నిట్టనిలువునా ముంచాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజంపేట పార్లమెంట్‌ అధ్యక్షుడు అమర్‌నాథ్‌రెడ్డి ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా, విభజన హామీలపై మొదటి నుంచి పోరాడుతున్న ఏకైక నాయకుడు ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని గుర్తు చేశారు. వైయస్‌ జగన్‌ నాయకత్వంలో ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఉద్యమాలు చేశామన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రరాష్ట్రాన్ని సమైఖ్యంగా ఉంచాలని పోరాడిన పార్టీ వైయస్‌ఆర్‌ సీపీ అన్నారు. విభజనతో ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరుగుతుందని తెలిసినా.. విభజనకు అనుకూలంగా చంద్రబాబు లేఖ ఇచ్చారన్నారు. విభజనతో ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు వెనుకబడిపోయాయన్నారు. విభజన సమయంలో ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని తిరుపతి వెంకన్న సాక్షిగా హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన మోడీ, చంద్రబాబులు వాటిని అమలు చేయకుండా రాష్ట్రానికి అన్యాయం చేశారని మండిపడ్డారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లుగా ఏనాడూ ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదన్నారు. హోదా ఉద్యమం సజీవంగా ఉందంటే అది ఒక్క వైయస్‌ జగన్‌ వల్లేనన్నారు. హోదా కంటే ప్యాకేజీ మేలని ప్రగల్భాలు పలికి.. ప్రజల ఆగ్రహం చేసిన తరువాత యూటర్న్‌ తీసుకొని హోదా ఉద్యమం నాది అని ప్రచారం చేసుకుంటున్నాడన్నారు. నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో రాష్ట్రం అధోగతిపాలైందని... ప్రజలు తెలుగుదేశం పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. రాబోయే ఎన్నికల్లో వైయస్‌ఆర్‌ సీపీని అధికారంలోకి తీసుకురావాలని కోరారు
Back to Top