ఢిల్లీ వేదికగా మరోసారి ప్రజలను వంచించిన బాబు

బాబు పోరాటాలు చేసే వ్యక్తి కాదు

అందితే జుట్టు...లేకుంటే కాళ్లు
పట్టుకునే రకం

బిజెపి..టిడిపి లాలూచీ రాజకీయాలు
చేస్తున్నాయి.

వైయస్ ఆర్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి
అంబటి రాంబాబు

 విజయవాడ:  ఢిలీల్లో నీతి ఆయోగ్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వంతో అమితుమీ తేల్చుకుంటానంటూ
ఘీంకరిస్తూ వెళ్లిన చంద్రబాబు పూర్తిగా ఫెయిల్ అయ్యారని, ప్రజలను మరోసారి ఘోరంగా
మోసం చేశారని వైయస్ ఆర్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు.
చంద్రబాబు పోరాటాలు చేసే వ్యక్తి కాదని, అందితే జుట్టు, లేకుంటే కాళ్లు పట్టుకునే
వ్యక్తి అని ఆయన అన్నారు. చంద్రబాబు ఢిల్లీ వెళ్లి ఏం సాధించారో చెప్పాలని డిమాండ్
చేశారు. చంద్రబాబు అవకాశ వాద రాజకీయాలకు నూకలు చెల్లే రోజు దగ్గర్లోనే ఉందన్నారు.
విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు.

నీతి
ఆయోగ్ సమావేశంలో పాల్గొని అవసరమైతే నిలదీయబోతున్నారంటూ, చంద్రబాబు ఉగ్రరూపం
చూడనున్నారని ప్రచారం చేసుకున్నారనీ, మల్లయోధులు వెళుతున్నట్లుగా పుంఖాను
పుంఖానులుగా కథనాలు ప్రసారం చేసి,పత్రికల్లో ఊకదంపుడు వార్తలను అచ్చు వేయించుకున్నారంటూ విమర్శించారు. అయితే వాస్తవంలో జరిగింది మాత్రం చంద్రబాబు మోడీకి వంగి వంగి దండాలు
పెట్టడమే అని అందుకు సంబంధించిన ఫోటోలను ప్రదర్శించారు. సమావేశంలో నవ్వుతూ మోడితో
భేటీ అయ్యి, పైకి మాత్రం నిలదీతలంటూ ప్రచారం చేసుకోవడం నాటకాలు కాక ఏమిటిని అడిగారు.
డ్రామాలు ఆడటంలో చంద్రబాబును మించిన వ్యక్తి మరొకరు లేరని, ఢిల్లీలో భూకంపం
సృష్టిస్తారన్న చంద్రబాబు ఏం చేశారో చెప్పాలని అంబటి డిమాండ్ చేశారు.

నీతి
ఆయోగ్ సమావేశం తరువాత ఫలితాలు తీసుకుని వస్తారని ఆశపెట్టిన బాబు ప్రజలను పచ్చిగా
దగా చేశారనీ. ఢిల్లీ వేదికగా మరోసారి రాష్ట్రాన్ని ముంచారని ధ్వజమెత్తారు. ఢిల్లీ
నీతి ఆయోగ్ లో చక్రం తిప్పుతానంటూ వెళ్లిన బాబ తిప్పిన చక్రంతో అనేక మంది
శిరస్సులు తెగిపడిన దృశ్యాలు చూశామంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

టిడిపి,
బిజెపిలు లాలూచి రాజకీయాలు చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. కర్నాటక ఎన్నికల
తరువాత చంద్రబాబుపై కేసులు పెడతామంటూ హుంకరించిన బిజెపి నాయకులు ఇప్పుడు ఏమీ
మాట్లాడటం లేదనీ, అలాగే ప్రధానమంత్రి మోడీకి సంబంధించిన అవినీతి కేసును
బయటపెడతానంటూ ఇక్కడి టిడిపి వారు సవాల్ విసురుకోవడం అటు తరువాత చప్పబడిపోవడం తప్ప
వాస్తవాలు బయటకు రావడం లేదనీ, ఇది వీరిద్దరి మధ్య లాలూచికి నిదర్శనం కాదా అని
అంబటి ప్రశ్నించారు.

అది
బూటకపు సర్వే...మైండ్ గేమ్ లో భాగం

ఇప్పటికిప్పుడు
ఎన్నికలు జరిగితే తిరిగి చంద్రబాబు నాయుడే అధికారంలోకి వస్తారంటూ వెల్లడైన ఒక
సర్వేకు సంబంధించిన ప్రశ్నలపై స్పందిస్తూ ఈ సర్వేలు ఎవరి కోసం, ఎవరు చేయిస్తున్నారో
ప్రజలందరికీ తెలుసని అన్నారు. అయినా 18 నియోజకవర్గాల్లో సర్వే చేసి, 175 నియోజకవర్గాలకు
లెక్కగట్టడంలోనే దీని విశ్వసనీయత తేటతెల్లం అవుతోందన్నారు. ఆ పత్రిక, ఆఛానల్
ఎవరికి ఊడిగం చేస్తున్నాయో, అలానే ఆ సర్వే నిర్వహించిన సంస్థ కూడా ఎవరి మెప్పు
కోసం ప్రాపకం కోసం పాకులాడుతోందో బహిరంగంగా తెలిసిన అంశాలే అన్నారు. ఇలాంటి
తప్పుడు ప్రచారాలతో రాజకీయ లబ్ధి పొందాలనుకునే వారి రాజకీయాలకు నూకలు చెల్లే
రోజులు వచ్చాయని అంబటి హెచ్చరించారు.

ప్రజా
సంకల్పయాత్ర పాదయాత్ర చేస్తున్న తమ పార్టీ నాయకుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డికి
రోజురోజుకు పెరుగుతున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక, పాదయాత్రలతో బ్రిడ్జిలే ఊగుతున్న
తీరును జీర్ణించుకోలేక, వాటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు చేస్తున్న యత్నాల్లో
భాగంగానే ఇటువంటి సర్వే రిపోర్టులను ప్రకటిస్తున్నారని ఆయన విమర్శించారు. ఇది ఒక
విధమైన మైండ్ గేమ్ అని మండిపడ్డారు.

ఎట్టి
పరిస్థితుల్లోనూ చంద్రబాబు నాయుడు తిరిగి ముఖ్యమంత్రి అయ్యే ప్రశ్నే లేదనీ, ఆయనను
తట్టుకోడానికి ప్రజలు సిద్ధంగా లేరనీ స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో ఇంకా ఎన్నో
మైండ్ గేమ్ లు ఆడటానికి చంద్రబాబు రెడీగా ఉన్నారని అంబటి ఆరోపించారు. 

తాజా వీడియోలు

Back to Top