పచ్చమీడియాను అడ్డుపెట్టుకొని బాబు అరాచకాలు

వైఎస్సార్సీపీ ఐటీ విభాగం సేవ్ డెమోక్రసీ పేరుతో బెంగళూరులో ధర్నా చేపట్టింది. ఏపీలో ఇలాంటి అరాచకాలు చోటుచేసుకోవడం దారుణమని ఈసందర్భంగా వారు మండిపడ్డారు.  పబ్లిక్ గా పట్టపగలే మార్కెట్లో కూరగాయలు కొన్నట్టు చంద్రబాబు ఎమ్మెల్యేలను కొనడం అత్యంత హేయనీయమన్నారు. ఇలాంటి వాటిని అరికట్టేందుకు రాష్ట్రపతి, ప్రధాని చొరవ తీసుకోవాలని కోరారు. పచ్చమీడియాను అడ్డుపెట్టుకొని చంద్రబాబు రాష్ట్రంలో అరాచకాలు సృష్టిస్తున్నారని ఫైరయ్యారు. న్యాయస్థానాలు సహా అన్ని వ్యవస్థలను చంద్రబాబు భ్రష్టుపట్టిస్తున్నారన్నారు. మీడియా వీటిని ఓ బాధ్యతగా తీసుకొని ఈఅనైతిక చర్యలను ప్రజలకు తెలియజెప్పాలన్నారు.

Back to Top