బాబుకు దమ్ముంటే సీబీఐతో విచారణ జరిపించాలి

విజయవాడః అగ్రిగోల్డ్ ఆస్తుల కొనుగోలులో బడాబాబుల పాత్ర ఉందని.. అందుకే విచారణ ముందకు సాగటం లేదని వైఎస్సార్సీపీ నేత లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. అగ్రిగోల్డ్ ఆస్తుల కొనుగోలు చేసిన వారిలో నారా లోకేష్ కూడా ఉన్నారని లక్ష్మిపార్వతి స్పష్టం చేశారు.  విజయవాడలో జరిగిన అగ్రిగోల్డ్ బాధితుల ర్యాలీలో ఆమె పాల్గొన్నారు.  చంద్రబాబు నాయుడికి దమ్ముంటే.. అగ్రిగోల్డ్ కేసును సీబీఐ చేత విచారణ చేయించాలని సవాల్ చేశారు. ఇప్పటికైనా బుద్ధితెచ్చుకుని అగ్రిగోల్డ్ ఆస్తులు అమ్మి బాధితులకు ఇచ్చేయాలని బాబుకు సూచించారు.

తాజా ఫోటోలు

Back to Top