బాబు, లోకేష్ లు జైలుకెళ్లడం ఖాయం

కర్నూలు(బనగానపల్లె): ప్రజల మనిషిగా పేరు గాంచిన వైయస్‌సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్‌మోహన్ రెడ్డిని విమర్శించే స్థాయి టీడీపీకి చెందిన సోమిశెట్టి వెంకటేశ్వర్లుకు లేదని ఆ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సిద్దంరెడ్డి రామ్మోహన్‌రెడ్డి తో పాటు మరికొందరు నాయకులు మండిపడ్డారు. వైయస్సార్సీపీ బనగానపల్లె నియోజకవర్గ కన్వీనర్, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి స్వగృహం వద్ద పార్టీ కార్యాలయంలో  ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు సోమిశెట్టిపై ధ్వజమెత్తారు.

మాట్లాడేటప్పుడు స్థాయిని గుర్తించాలని సోమిశెట్టికి సూచించారు. అమరావతి నిర్మాణంలో పాల్పడుతున్న అవినీతితో సీఎం చంద్రబాబు,లోకేష్  త్వరలో జైలుకెళ్తారని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్న విషయాన్ని సోమిశెట్టి తెలుసుకోవాలన్నారు.  విలేకర్ల సమావేశంలో పార్టీ జిల్లా డాక్టర్ల విభాగం అధ్యక్షులు డాక్టర్ మహ్మద్ హుసేన్, బీసీ సెల్ జిల్లా నాయకులు పాపన్న, కార్యవర్గ సభ్యులు మురళీమోహన్‌రెడ్డి, కంబగిరి స్వామి పాల్గొన్నారు.
Back to Top