బాబు.. లోకేష్ లు జైలుకే..?

()కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏపీ ప్రజలను మోసగిస్తున్నాయి
()విభజన హామీలపై బాబు కేంద్రంతో పోరాడకపోవడం దారుణం
()చట్టంలో లేనందునే హోదా రాలేదనడం సిగ్గుచేటు
()నయీం అనే విషపు మొక్కను నాటింది చంద్రబాబే
()వైయ‌స్సార్సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధర్ రెడ్డి

హైద‌రాబాద్‌:  కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు అధికారంలోకి వ‌చ్చి రెండున్న‌ర ఏళ్లు గ‌డుస్తున్నా  ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ఇచ్చిన ఒక్క‌ హామీని కూడా అమ‌లు చేయలేక‌పోయాయ‌ని వైయ‌స్సార్‌సీపీ నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్ రెడ్డి మండిపడ్డారు. పార్టీ కేంద్ర కార్యాల‌యంలో విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడారు. ప్ర‌త్యేక హోదా విభ‌జ‌న చ‌ట్టంలో లేద‌ని చెబుతున్న చంద్ర‌బాబు.... విభ‌జ‌న చ‌ట్టంలో ఉన్న హామీల అమ‌లు కోసం  కేంద్ర‌ప్ర‌భుత్వాన్ని ఎందుకు నిల‌దీయడం లేద‌ని ప్ర‌శ్నించారు. 

మ‌రిన్ని విష‌యాలు ఆయ‌న మాటల్లోనే...
* కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు మ్యాచ్‌ఫిక్సింగ్ రాజ‌కీయాల‌తో ఏపీని మ‌రోసారి మోసం చేయాల‌ని చూస్తున్నాయి
* పార్ల‌మెంట్ సాక్షిగా ఆనాటి ప్ర‌ధాన‌మంత్రి మ‌న్మోహ‌న్ సింగ్ ఏపీకి ప్ర‌త్యేక హోదా కేటాయించారు
* ఎన్నిక‌ల స‌మయంలో మోడీ, చంద్ర‌బాబులు అధికారంలోకి రాగానే ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌న్నారు
*  అధికారంలోకి వ‌చ్చి రెండున్న‌ర ఏళ్లు అవుతున్నా ప్ర‌త్యేకహోదా హామీ ఎందుకు అమలు కావడం లేదు.
* రాష్ట్ర సీఎంగా నిజాయితీగా రాష్ట్ర‌ప్ర‌యోజ‌నాల కోసం ఎందుకు పోరాటం చేయ‌డం లేదో చంద్ర‌బాబు ప్ర‌జ‌ల‌కు స‌మాధానం చెప్పాలి
* విభ‌జ‌న చ‌ట్టంలో లేనందునే ఏపీకి ప్ర‌త్యేక హోదా రావ‌డం లేద‌ని రాష్ట్ర సీఎం చెప్ప‌డం సిగ్గుచేటు
* మ‌రి ఎన్నిక‌ల స‌మ‌యంలో ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇస్తాన‌ని తిరుమ‌ల వెంక‌టేశ్వ‌రుడిగా సాక్షిగా చెప్పిన‌ప్పుడు ప‌క్క‌నే ఉన్న చంద్ర‌బాబుకు విన‌బ‌డ‌లేదా..?
* కేంద్రం అన్యాయం చేస్తుంద‌ని ఒక ప‌క్క చంద్ర‌బాబు మాట్లాడుతాడు. మ‌రోప‌క్క టీడీపీ నాయ‌కులు విజ‌య‌వాడ బీజేపీ కార్యాల‌యంలో చీపుర్ల‌తో క‌డ‌ుగుతున్నారు. కడగాల్సింది కార్యాలయాన్ని కాదు ద‌మ్ముంటే ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ ఇంటిముందు నిరసన తెలపాలి
* మిత్ర‌ప‌క్షంగా ఉన్న బంధాన్ని తెంచుకొంటే అప్పుడు కేంద్రంపై ఒత్తిడి వ‌స్తుంద‌న్న నిజాన్ని బాబు తెలుసుకోవాలి
* స‌ఖ్యత‌గా ఉంటే ఏదైనా చేయ‌వ‌చ్చ‌ని చెబుతున్న చంద్ర‌బాబు రెండున్న‌రేళ్లుగా స‌ఖ్య‌త‌గా ఉండి ఏం సాధించారు..?
* ఒక‌ప‌క్క కేంద్రం ఏం ఇవ్వ‌డం లేదంటునే స‌ఖ్యత‌గా ఉండ‌డం ఎందుకు బాబూ?
* కేంద్ర ప్ర‌భుత్వంతో స‌ఖ్యత‌గా ఉండ‌డం వ‌ల్ల  కేవ‌లం చంద్ర‌బాబు లోకేష్‌ల‌కే  ఉప‌యోగ‌ప‌డతాయి
* రాజ‌ధాని భూముల దందాకు సంబంధించి జరిగిన రూ. ల‌క్ష 50వేల కోట్ల కుంభ‌కోణంపై సీబీఐ విచార‌ణ జ‌రిగితే చంద్ర‌బాబు, లోకేష్‌లు జైలుకెళ్లాల్సి వ‌స్తుంది.
* ఓటుకు నోటు కేసులో బ్రీఫ్‌డ్‌మీ అంటూ బాబు మాట్లాడిన మాట‌లు ప్ర‌పంచ‌వ్యాప్తంగా అన్ని ప‌త్రిక‌లు, టీవీల్లో వ‌చ్చినా ఆయ‌న జైలుకెళ్లడం లేదు. 
.* రాష్ట్ర ప్ర‌యోజ‌నాలు గాలికి వ‌దిలేసి  సొంత ప్ర‌యోజ‌నాల కోస‌మే బాబు కేంద్రంతో స‌ఖ్యత‌గా ఉంటున్నారు 
* ఏపీ దావూద్ఇబ్ర‌హీం నయీం అనే విష‌పు మొక్క‌ను రాష్ట్రంలో నాటింది చంద్ర‌బాబే
* రాష్ట్ర ప్ర‌యోజ‌నాలు ఏమైతే నాకేందుకు... నా చిన్ని పొట్ట‌, నా కుమారుడి చిన్నిపొట్టలే మాకు శ్రీ‌రామ ర‌క్ష అన్న ధోర‌ణి చంద్ర‌బాబుది
* ఇప్ప‌టికైనా చంద్ర‌బాబు రాష్ట్ర‌ప్ర‌యోజ‌నాల కోసం పోరాటం చేయాలి
* ఉగ్ర‌వాదులు, తీవ్ర‌వాదుల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ కేంద్రంగా మార‌కుండా ఉండాలంటే ప్ర‌త్యేక హోదా, పోల‌వ‌రం సాధ‌న జ‌ర‌గాలి
* వైయ‌స్ రాజ‌శేఖ‌రరెడ్డి ముఖ్య‌మంత్రిగా ఉన్న హయంలో 174 కిలోమీట‌ర్లు పోల‌వ‌రం కుడికాలువ నిర్మాణ ప‌నులు జ‌రుగుతుంటే... ఆ కాలువ ప‌నుల‌ను టీడీపీ అడ్డుకుంది
* ఆనాడు పోల‌వ‌రం నిర్మాణం వ‌ద్ద‌ని కేసులు వేసిన‌వారే... నేడు టీడీపీ అధికారంలోకి రాగానే వాటిని వాప‌స్ తీసుకున్నారు
* చంద్ర‌బాబు తీసుకుంటున్న నిర్ణ‌యాలు పోల‌వ‌రం ప్రాజెక్టుకు స‌మాధి క‌ట్టేలా ఉన్నాయి

విభ‌జ‌న చ‌ట్టంలో ఉన్న హామీల మాటేంటి చంద్ర‌బాబూ..?
* రాష్ట్రంలో అనేక విద్య‌సంస్థ‌ల ఏర్పాటు కోసం కేంద్రం ఇచ్చిన నిధులు పాఠ‌శాల‌ల‌కు ప్ర‌హారి గోడ‌లు క‌ట్టేందుకు కూడా స‌రిపోవ‌ని దానిని ఎందుకు నిల‌దీయ‌డం లేదు చంద్ర‌బాబు.
* దుర్గ‌రాజ్‌ప‌ట్నం పోర్టు మొత్తం పూర్తి చేస్తాన‌న్న కేంద్రం హామీ ఏమైంది?
* కేంద్ర ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో క‌డ‌ప‌లో ఉక్కుకర్మాగారం(స్టీల్‌ప్లాంట్) నిర్మిస్తామ‌న్న మోడీ హామీ ఇంత‌వ‌ర‌కు అమ‌లు కాలేదు
* ఢిల్లీ, ముంబాయి త‌ర‌హాలో చెన్నై - విశాఖ‌ప‌ట్నం ర‌హ‌దారి మొత్తం ఇండ‌స్ట్రీయ‌ల్ క్యారిడ‌ర్ పెట్టి పారిశ్రామిక కేంద్రాలుగా మార్చి, రోడ్డుకు ఇరువైపులా ఫ్యాక్ట‌రీలు నెల‌కొల్పి, ల‌క్ష‌ల ఉద్యోగాలు క‌ల్పిస్తామ‌న్న హామీ ఏమైంది
* విభ‌జ‌న చ‌ట్టంలో ప్ర‌త్యేక హోదా లేద‌ని స‌న్నాయి నొక్కులు నొక్కుతున్న సీఎం చంద్ర‌బాబు ఇచ్చిన హామీల కోసం ఎందుకు ప్ర‌శ్నించ‌రు
* పోల‌వ‌రం ప్రాజెక్టును పూర్తిస్థాయిలో కేంద్ర‌మే నిర్మిస్తుంద‌న్న విభ‌జ‌న చ‌ట్టం హామీ ఎందుకు అమ‌లు కావ‌డం లేదు
* పంజాబ్‌లో గురుగోవింద్ సింగ్ జ‌యంతి ఉత్స‌వాల‌కు వంద‌కోట్లు కేటాయించిన మోడీ స‌ర్కార్ పోల‌వ‌రంకు ఎందుకు నిధులు కేటాయించ‌డం లేద‌ని చంద్ర‌బాబు ప్రశ్నించకపోవడం శోచనీయమని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు.  

తాజా వీడియోలు

Back to Top