వైయస్ జగన్ పర్యటనతో బాబుకు గుండెదడ

  • బాబు, మంత్రులవి చౌకబారు రాజకీయాలు
  • అమరావతి మీ అడ్డ కాదు..కారుకూతలు మానుకోవాలి
  • వైయస్ జగన్ నాయకత్వం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు
  • వైయస్ జగన్ కు వస్తున్న జనప్రవాహాన్ని ఆపలేరు
  • రాళ్లు, చెప్పులు వేయించే సంస్కృతి టీడీపీది
  • ప్రతీ ఒక్కరినీ గౌరవించే సంస్కారం వైయస్సార్సీపీది
  • అది వైయస్ జగన్ రక్తంలోనే ఉంది
  • వైయస్సార్సీపీ నేతలు జోగి రమేష్, వెల్లంపల్లి
విజయవాడః రాజధాని చంద్రబాబు అడ్డ కాదని, అది వైయస్సార్సీపీ గడ్డ అని వైయస్సార్సీపీ అధికార ప్రతినిథి జోగిరమేష్ అన్నారు.  వైయస్ జగన్ నాయకత్వం కావాలని వేలాది గొంతులు నినదించాయని పేర్కొన్నారు.  వైయస్సార్సీపీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్  అమరావతి పర్యటనతో దావోస్ లో ఉన్న ఏపీ సీఎంకు గుండె దడ పుట్టిందని ఎద్దేవా చేశారు.  వైయస్ జగన్ కు రాజధాని రైతులు బ్రహ్మరథం పట్టడంతో  ఓర్వలేక మంత్రులు దేవినేని, నారాయణ, ప్రత్తిపాటిలు పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారని జోగి రమేష్ నిప్పులు చెరిగారు. రాజధానిలో రైతులు పడుతున్న బాధలు, ఇబ్బందులను కళ్లకు కట్టినట్టు మీడియా ముఖంగా వైయస్ జగన్ చూపిస్తే, దానికి సమాధానం చెప్పలేక బాబు, మంత్రులు చౌకబారు రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. విజయవాడలో జోగిరమేష్,  వెల్లంపల్లి శ్రీనివాస్ మీడియా సమావేశంలో మాట్లాడారు. 

ప్రతిపక్ష నేత రాష్ట్రంలో పర్యటన చేయాలంటే పోలీసు పర్మిషన్ తీసుకోవాలా.? ఇదెక్కడి న్యాయం..?చంద్రబాబు విపక్ష నేతగా ఉన్నప్పుడు పోలీసులను అడిగే పర్యటన చేశారా..? జగన్ అంటే బాబుకు ఎందుకంత భయం..?రాజధానిలో జగన్ ను అడుగుపెట్టనివ్వం, ఆయనకు అర్హత లేదన్నావే. రాజధాని రైతులు, కూలీలు, చిన్నారులు వచ్చి జగన్ కు స్వాగతం చెప్పి మాకు ఈ ఇబ్బందులున్నాయని ప్రభుత్వానికి ఎలుగెత్తి చాటితే తప్పు చేసినట్లా..? జగన్ ఆ ప్రాంతంలో అడుగుపెట్టకపోతే రైతులు, కూలీలు, దళితులకు మేలు జరగదు. అక్కడ అడుగుపెట్ట బట్టే ప్రభుత్వం దిగివస్తోందని జోగి రమేష్ అన్నారు.  మీకు రైతులమీద ప్రేమ ఉంటే జగన్ సమక్షంలో రైతులు చెప్పిన విషయాల మీద దృష్టిపెట్టాలి గానీ...జగన్ పై రాళ్లు వేయడండి, అడ్డుకోండంటే మీ మాట ఎవరూ వినేపరిస్థితుల్లో లేరన్న సంగతి తెలుసుకోవాలని బాబుకు హితవు పలికారు. 

అఖిల ప్రియపై దాడి జరిగిందన్న టీడీపీ నేతల వ్యాఖ్యలను జోగి రమేష్  ఖండించారు. ఆ ప్రాంతం మొత్తం తాము పాదయాత్ర చేస్తూ నడిచామని.. మంత్రి రావెల, జూపూడి ప్రభాకర్ అక్కడి నుంచే వెళ్లారని, తాము ఎవరినీ అఢ్డుకోలేదని స్పష్టం చేశారు. అఖిలప్రియ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచినా, తమ అక్క శోభమ్మ కూతురు అని చెప్పి వైయస్సార్సీపీ నాయకులే ఆమెకు దారి ఇచ్చారని పేర్కొన్నారు.   అఖిలప్రియపై దాడి జరిగుంటే మొదట తామే ఖండించేవాళ్లమన్నారు.  వైయస్సార్సీపీ కి చెందిన నాయకులు, కార్యకర్తలు ఎవరూ ఆమెను ఒక్క మాట కూడ అనలేదన్నారు. జగన్ పర్యటనను, రైతుల వ్యధలు చూపించని కొన్నిఎల్లో మీడియా అఖిలప్రియపై దాడి జరిగిందంటూ లేనిది ఉన్నట్టు కల్పించడం దారుణమన్నారు. పోలీసులకైనా కళ్లు కనబడకపోతే ఎలా అని రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్సార్సీపీ కార్యకర్తల మీద మీ అరాచకాలేంటని, పోలీస్ వ్యవస్థనే దిగజార్చుతున్నారని మండిపడ్డారు. టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మహిళా ఎమ్మార్వోను జుట్టుపట్టుకొని లాగినా, టీడీపీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ బాపట్లలో తాగి ఆడవాళ్లను కొట్టినా, మరో టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ మీడియా మిత్రులను బెదిరించినా వాళ్లపై ఎలాంటి చర్యలు లేకపోవడం బాధాకరమన్నారు.  
 
చెప్పులు, రాళ్లు వేయించే సంస్కృతి టీడీపీదని జోగి అన్నారు.  ప్రతీ ఒక్కరినీ గౌరవించే సంస్కారం వైయస్సార్సీపీదని, అది తమ నాయకుని 
రక్తంలోనే ఉందన్నారు. చిన్నపిల్లలతో సహా పెద్దవాళ్లను గౌరవించే సంప్రదాయం వైయస్సార్ సీపీదని అన్నారు. బీపీ వచ్చిన వాడిలా మాట్లాడుతున్నావ్.  దాడి ఎక్కడ జరిగిందో వచ్చి చూపించాలని దేవినేనికి సవాల్ చేశారు. ఎక్కడో నెల్లూరులో కుర్చీలో కూర్చొని అఖిలప్రియపై దాడి జరిగిందని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడడం సిగ్గుచేటన్నారు. సోమిరెడ్డి నీకు ఏం తెలుసు...? రైతులు పడే బాధలు మీకు తెలుసా..? వైయస్సార్సీపీ నాయకులను తిడితే బాబు మంత్రి పదవి ఇస్తాడని సోమిరెడ్డి ఆశపడుతున్నట్టున్నాడని ఎద్దేవా చేశారు.  రైతులు, కూలీలు, దళితులు పడే కష్టాలను తమ అధినేత ప్రభుత్వానికి ఎలుగెత్తి చూపించారని జోగిరమేష్ పేర్కొన్నారు. చిల్లర రాజకీయాలు మానుకోవాలని బాబు, మంత్రులను హెచ్చరించారు. 

రాష్ట్రంలో దద్దమ్మ ముఖ్యమంత్రి ఉన్నాడు
రాజధానిలో కనకదుర్గ వారధి మొదలు తిరిగొచ్చేదాక వైయస్ జగన్ కు ప్రజలు మేలతాళాలతో బ్రహ్మరథం పట్టారని వైయస్సార్సీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్ చెప్పారు. తమ స్థలాలు ఇచ్చి అడుక్కునే పరిస్థితికి రావడం జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తుంటే...స్వచ్ఛందంగా భూములు ఇచ్చారని బాబు, ఆయన చెంచాలు చెప్పడం నీచమన్నారు. రైతులు కోర్టుకు, గ్రీన్ ట్రిబ్యునల్ కు ఎందుకు వెళ్లారో తెలియదా...? దీన్ని బట్టి వారి మనోవేధన ఏంటో ప్రభుత్వం అర్థం చేసుకోవాలన్నారు.  రైతులు స్థలాలు ఇచ్చారు, ఏ ఇబ్బందులు లేవంటూ మీడియాని అడ్డుపెట్టుకొని మంత్రులు ప్రత్తిపాటి, దేవినేని, నారాయణ రైతులను ఇబ్బందులు పెడుతూ భూములు లాక్కుంటున్నారని మండిపడ్డారు. రాజధానిలో మోసాలు, కుట్రలు, ఆక్రమణలు జరుగుతున్నందునే రైతులకు అండగా  ప్రతిపక్ష నేత నిలిచారని,  అక్కడి పరిస్థితులను ఎలుగెత్తారని చెప్పారు. వాస్తవాలను అంగీకరించలేక వైయస్సార్సీపీ నాయకులపై కేసులు పెట్టేలా అధికార పార్టీ వ్యవహరించడం దారుణమన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారన్నారు. 


దావోస్ లో ఒప్పందాలు జరిగాయని మీడియాలో ఫస్ట్ పఫేజ్ లో వేయించుకుంటూ చంద్రబాబు ప్రజలను మరోసారి మోసగిస్తున్నారని శ్రీనివాస్ దుయ్యబట్టారు. రూ. 7కోట్లతో స్టాల్స్ కొనుక్కొని దావోస్ లో వాచ్ మెన్ లాగ కూర్చొని పరిశ్రమలు తెస్తున్నామంటూ బాబు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికే ఏపీలో 20 శాతం పరిశ్రమలు తీసేయడం జరిగింది, ఉద్యోగాలు పోయాయని పెద్దలు చెబుతుంటే...లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొస్తున్నాను అని మభ్యపెడుతూ, సమ్మిట్ ల పేరుతో కోట్లు వృథా చేస్తూ బాబు ప్రజలను మోసం చేస్తున్నాకరని శ్రీనివాస్ దుయ్యబట్టారు . ఇంతమంది మంత్రులు వెళ్లడం దావోస్ వెళ్లడం దేనికని నిలదీశారు. రాష్ట్రానికి ఒక్క యూనిట్ తేకపోగా,  స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని తిరుగుతూ ఫైవ్ స్టార్ హోటళ్లలో మీటింగ్ లు పెడుతూ  వందల కోట్లు వృథా చేస్తున్న దద్దమ్మ ముఖ్యమంత్రి చంద్రబాబు అని ప్రజలంతా అనుకుంటున్నారని తెలిపారు. బాబు దిగిపోయే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు.  జగన్ కు వస్తున్న జనప్రవాహాన్ని ఎవరూ ఆపలేరన్నారు. వైయస్సార్సీపీకి  ప్రజల మద్దతు చూసి మంత్రులకు పిచ్చెక్కి కారుకూతలు కూస్తున్నారని ధ్వజమెత్తారు.  వైయస్ జగన్ పై ఆరోపణలు, వైయస్సార్సీపీ నాయకులపై కేసులు పెట్టడం మానుకోవాలని అధికార పార్టీకి సూచించారు. ప్రజారాజధాని నిర్మించాలని డిమాండ్ చేశారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top