బాబు అధికారంలోకి వచ్చాకే దాడులు

కాకినాడ: చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ప్రతిపక్ష నేతలపై దాడులు అధికమయ్యాయని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ యువజన విభాగం అధ్యక్షులు జక్కంపూడి రాజా అన్నారు. శిల్పా చక్రపాణిరెడ్డిపై జరిగిన హత్యాయత్నాన్ని ఆయన ఖండించారు. అవినీతిని ప్రశ్నిస్తున్న వారిపై దాడులు చేయడం చంద్రబాబుకు అలవాటైందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ఏనాడు కూడా ఇలాంటి దాడులు జరగలేదని చెప్పారు. టీడీపీ నేతలు తీరు మార్చుకోకపోతే ప్రజలే గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.

తాజా ఫోటోలు

Back to Top