బాబు ఉన్నంతకాలం దరిద్రం పోదు

ఢిల్లీ: చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం రాష్ట్రానికి పట్టిన దరిద్రం వీడదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే చీర్ల జగ్గిరెడ్డి ధ్వజమెత్తారు. వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీలంతా ఆంధ్రరాష్ట్ర ప్రయోజనాల కోసం ఆమరణ దీక్ష చేస్తుంటే.. చంద్రబాబు అఖిలపక్షం అంటూ ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం చేస్తున్నారని మండిపడ్డారు. పెళ్లయిన తరువాత పెళ్లి చూపులు పెట్టినట్లుగా చంద్రబాబు వైఖరి ఉందన్నారు. 30వ సారి ఢిల్లీ వచ్చి పార్లమెంట్‌కు మొక్కి ఫొటోలకు ఫోజులు ఇచ్చి వెళ్లిపోయారన్నారు. ఓటుకు కోట్ల కేసులో అడ్డంగా దొరికిపోయి మోడీ జైల్లో పెడతారనే భయంతోనే ప్రత్యేక హోదాను చంద్రబాబు అణగదొక్కారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ, చంద్రబాబు కుర్చీల కాళ్లు ప్రజలే విరగ్గొడతారనే విషయాన్ని గ్ర హించాలన్నారు. ప్రజలను ఓట్ల కోసం మోసగిస్తున్న చంద్రబాబు శరీరంలో ఆంధ్రరాష్ట్ర రక్తం ప్రవహిస్తే.. వెంటనే టీడీపీ ఎంపీలతో రాజీనామాలు చేయించాలని డిమాండ్‌ చేశారు. బ్రిటీష్‌ వారి హయాంలో చంద్రబాబు నాయుడు ఉండుంటే.. వారితో కూడా స్వాతంత్య్రం రాకుండా రాజీకుదిర్చేవాడని ఆరోపించారు. తల్లికాంగ్రెస్‌.. పిల్ల కాంగ్రెస్‌ అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీపై బురదజల్లిన చంద్రబాబు బీజేపీతో తెగదెంపులు చేసుకున్న చంద్రబాబు కాంగ్రెస్‌ కాళ్లు పట్టుకుంటున్నాడన్నారు. 
Back to Top