ఆత్మహత్యలకు బాబే బాధ్యుడు

  • యువతకు ఏం సమాధానం చెబుతారు బాబూ..?
  • పెట్టుబడులొచ్చాయి, ఉద్యోగాలిచ్చామంటూ ప్రభుత్వం మోసం చేస్తోంది
  • ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దు..వైయస్సార్సీపీ అండగా ఉంటుంది
  • యువత భవిష్యత్తు కోసమే వైయస్ జగన్ ప్రత్యేకహోదా పోరాటం
  • నిరుద్యోగులకు బాబు భృతి ఇచ్చి తీరాలి..లేకపోతే ఉద్యమం తప్పదు
  • వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి వెల్లంపల్లి శ్రీనివాస్
విజయవాడః ప్రతి ఒక్కరూ చదువుకొని ఉన్నతంగా స్థిరపడాలని మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్ మెంట్ తో విద్యార్థులను ఆదుకుంటే....చంద్రబాబు మాత్రం వారు చనిపోవడానికి కారణమవుతున్నాడని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు.  అధికారంలోకి వచ్చాక రెండుసార్లు సమ్మిట్ లు పెట్టి, లక్షల కోట్లలో పెట్టుబడులొచ్చాయి, చాలామందికి ఉద్యోగాలొచ్చాయని డబ్బాలు కొట్టుకుంటున్న టీడీపీ నేతలు నిన్నటి ఆత్మహత్యలకు ఏం సమాధానం చెబుతారని వెల్లంపల్లి ప్రశ్నించారు. ఎవరైతే సూటు బూటు వేసుకున్నారో వారికి అగ్రిమెంట్లు రాసి వృథాగా వందల కోట్లు సమ్మిట్ లకు ఖర్చుపెట్టారే తప్ప బాబు ఏ ఒక్కరికీ ఉద్యోగాలిచ్చిన పాపాన పోలేదన్నారు. బాబు సమ్మిట్ పెట్టిన ప్రాంతంలోనే పాయకరావు పేటకు చెందిన ఎస్సీ దళిత కుర్రాడు, గోల్డ్ మెడలిస్ట్  ఉద్యోగం రాక ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఉందన్నారు. ఈ ప్రభుత్వం యువతకు ఏం సమాధానం చెబుతోందని వెల్లంపల్లి నిలదీశారు. నిరుద్యోగుల ఆత్మహత్యలకు ముఖ్యమంత్రి  బాధ్యత వహించాలన్నారు.  నిరుద్యోగులకు ఇస్తామన్న భృతి ఇచ్చి తీరాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉద్యమించక తప్పదని హెచ్చరించారు.  

రాష్ట్రానికి ప్రత్యేకహోదా వస్తే అనేక పరిశ్రమలొచ్చి యువతకు ఉపాధి దొరుకుతుందని వైయస్ జగన్ స్పెషల్ స్టేటస్ కోసం పోరాడుతుంటే...ముఖ్యమంత్రి, మంత్రులు మాత్రం ప్రజలతో పనిలేదు, తమకు ప్యాకేజీ వస్తే చాలన్న విధంగా ఉండడం బాధాకరమన్నారు.   హోదా కోసం గట్టిగా ప్రయత్నిద్దాం. ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దు. యువత ధైర్యంగా ఉండాలంటూ వైయస్ జగన్ ట్వీట్ చేసిన విషయాన్ని వెల్లంపల్లి గుర్తు చేశారు.  తప్పకుండా రానున్నది ప్రజల పరిపాలన కాబట్టి ఎవరూ అధైర్యపడొద్దని వైయస్సార్సీపీ తరపున వెల్లంపల్లి యువతకు పిలుపునిచ్చారు. విద్యార్థులు,  నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వానికి  చీమకుట్టినట్టు కూడ లేదని వెల్లంపల్లి మండిపడ్డారు.  ఎవరూ  ఆత్మహత్యలు చేసుకోవద్దని,  వైయస్సార్సీపీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. వైయస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక యువతకు ఉపాధి లభిస్తుందని హామీ ఇచ్చారు.  

తాజా ఫోటోలు

Back to Top