<strong>కాకినాడ, 27 మార్చి 2013:</strong> చంద్రబాబు నాయుడు నడిచే చోటల్లా పచ్చగడ్డి కూడా ఎండిపోతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబు పర్యటనకు నిరసనగా గురువారం ఒక్కరోజు తాను నిరాహార దీక్ష చేయనున్న బుధవారం కాకినాడలో ప్రకటించారు. పాదయాత్ర నెపంతో ఒక పక్కన చంద్రబాబు ప్రజలను మభ్యపెడుతున్నారని, మరోపక్కన ప్రజా కంటక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తానే కాపాడుతున్నారని చంద్రశేఖర్ రెడ్డి నిప్పులు చెరిగారు. తన మీద ఉన్న అవినీతి ఆరోపణలపై సిబిఐ దర్యాప్తు నుంచి తప్పించుకోవడానికే చంద్రబాబు నాయుడు అవిశ్వాసానికి మద్దతు ఇవ్వలేదన్నారు.