బాబుకు నీతి నియమాలు లేవు

సుజాతనగర్ (ఖమ్మం జిల్లా) 04 మే 2013:

రాష్ట్రంలో దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ చేపట్టిన ప్రతి పథకాన్నీ కిరణ్  సర్కారు నీరు గార్చిందని శ్రీమతి షర్మిల ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రంలోని ప్రతి గుండెలో వైయస్ఆర్ ఉన్నారన్నారు. ఖమ్మం జిల్లా సుజాతనగర్‌లో శనివారం సాయంత్రం నిర్వహించిన సభలో ఆమె ప్రసంగించారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి షర్మిల శనివారం 138వ రోజు మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా సుజాత నగర్లో పర్యటించారు.

జగనన్న సీఎం కాగానే అమ్మ ఒడి పథకాన్ని అమలు చేస్తారని చెప్పారు. అమ్మ ఒడి పథకం ద్వారా అందరినీ ఆదుకుంటామన్నారు. చంద్రబాబు కాంగ్రెస్ సర్కారును కనుసన్నల్లో కాపాడుతున్నారన్నారు. ప్రతిపక్షనేత చంద్రబాబుకు నీతి నియమాలు లేవని మండిపడ్డారు.

Back to Top