బాబు ఆరోపణలే ఎల్లోమీడియాకు బ్యానర్లు

పెనుగంచిప్రోలు(కృష్ణా జిల్లా), 20 ఏప్రిల్ 2013:

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు డైరెక్షన్లో ఆ పార్టీ నాయకులు జగనన్న మీద అర్థంపర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని శ్రీమతి వైయస్ షర్మిల మండిపడ్డారు. కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులో శనివారం సాయంత్రం ఏర్పాటైన సభలో ఆమె ప్రసంగించారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం శనివారంనాటికి 126వ రోజుకు చేరింది. సభలో ఆమె మాట్లాడుతూ వారు చేసిన ఆరోపణల ఆధారంగా మరుసటి రోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలలో బ్యానర్ వార్తలను ప్రచురిస్తారని ఆమె వివరించారు. అక్కడినుంచి కాంగ్రెస్ నాయకులు స్వరం కలుపుతారని చెప్పారు. అవే ఆరోపణలను, ప్రచురితమైన పత్రికల వార్తల ఆధారంగా జగనన్నకు వ్యతిరేకంగా సీబీఐ చార్జిషీటును దాఖలు చేస్తుందని ఎద్దేవా చేశారు.

జగనన్నను ఆపే దమ్మూ, ధైర్యమూ కాంగ్రెస్, టీడీపీలకు లేదన్నారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్‌ఆర్  హయాంలో రైతు రాజులా బతికాడని  అన్నారు. రైతు పంట కోల్పోతే నష్టపరిహారం అందించారనీ, రూ.12వేల కోట్ల రుణమాపీ చేశారని గుర్తు చేశారు. టీడీపీని చంద్రబాబు కాంగ్రెస్‌కు అమ్మేశారనీ, అందుకే ప్రజలపై రూ. 30వేల కోట్ల కరెంట్ భారం వేసినా నోరు మెదపడం లేదని ఆరోపించారు. హిట్లర్, చంద్రబాబు పుట్టిన తేదీ ఒక్కటేనని, అందుకే ఇద్దరి ఆలోచనలకు దగ్గరి పోలికలున్నాయనీ శ్రీమతి షర్మిల చెప్పారు.

తాజా వీడియోలు

Back to Top