అవిశ్వాసానికి మద్దతు పలుకుతాం: మేకపాటి

హైదరాబాద్, 12మార్చి 2013:

ప్రజా సమస్యల పరిష్కారంలో అన్ని విధాలా విఫలమైన ప్రభుత్వం మీద ఏ పార్టీ అవిశ్వాసం పెట్టినా మద్దతిస్తామని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి స్పష్టం చేశారు.  నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు. ముందుచూపులేని పాలకుల కారణంగా మితిమీరిన కరెంట్‌ కోతలు పారిశ్రామిక రంగాన్ని దెబ్బతీశాయని మేకపాటి  వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్‌ అవిశ్వాసం పెడితే తమ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

Back to Top