అవినీతి మంత్రులను ఎందుకు తొలగించడం లేదు?

గుంటూరు, 07 మే 2013:

బొగ్గు కుంభకోణంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరిని చూస్తూ కూడా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డికి బెయిలిస్తే సాక్ష్యాలను తారుమారు చేస్తారనడం ఎంతవరకూ సమంజసమని పార్టీ అధికార ప్రతినిధి ప్రశ్నించారు. అవినీతి మంత్రులను ఎందుకు తొలగించడంలేదని ఆయన కేంద్రాన్ని నిలదీశారు. పిఎంఓలో సీబీఐ నివేదికను ట్యాంపరింగ్ చేసినా కేసులు నమోదు చేయలేదన్నారు. అవినీతి మంత్రులను తొలగించడానికి కేంద్రం ఎందుకు ముందుకు రావడం లేదు? అని అడిగారు. ప్రజాస్వామ్యం మంట కలిసినా పట్టించుకునే నాథుడే లేడని అంబటి ఆవేదన వ్యక్తం చేశారు. బొగ్గు గనుల కేటాయింపు వ్యవహారంలో సాక్ష్యాలను తారుమారు చేసిన పెద్దమనుషులను వదిలేశారని పేర్కొన్నారు.

ఢిల్లీలో కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని అత్యాచారం చేస్తున్నప్పటికీ టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు స్పందించడం లేదని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ను మరణానికి కారణమైన చంద్రబాబు, ఆయన విగ్రహాప్రతిష్టాపనకు వెళ్లడం సిగ్గుచేటుని  చెప్పారు. సీబీఐనీ చూసి చంద్రబాబు భయపడుతున్నారనీ, సీబీఐ వ్యవహారం బయటకు వచ్చినా ఆయన నోరు ఎత్తకపోవడానికి కారణమేంటనీ అంటి నిలదీశారు. మంత్రి శైలజానాథ్ వ్యవహారంపై కాంగ్రెస్ నేతలు ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. తమ నేతలు కొణతాల రామకృష్ణ, కొండా సురేఖపై ఎల్లోమీడియా విషప్రచారానికి పాల్పడుతోందని విమర్శించారు. తమ పార్టీ శ్రేణుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడానికి ఎల్లోమీడియా చేస్తున్న యత్నాలు సఫలం కావని అంబటి స్పష్టంచేశారు.

Back to Top