అవినీతి సొమ్మంతా నంద్యాలలో ఖర్చు

– ఒక్క సీటు కోసం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు
– డబ్బులు లేవంటూనే నంద్యాలలో వందల కోట్లు ఖర్చు
–  అనేక మందికి పదవులు ఇచ్చి ప్రలోభ పెట్టారు


హైదరాబాద్‌: నంద్యాల ఉప ఎన్నికలో అధికార పార్టీ అడ్డదారులు తొక్కిందని,  చంద్రబాబు మూడేళ్ల కాలంలో సంపాదించిన అవినీతి సొమ్మంతా నంద్యాలలో ఖర్చు చేశారని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. బుధవారం సాయంత్రం ఆయన హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు ఎన్నికల నోటిఫికేషన్‌ రాకముందే నంద్యాలకు వెళ్లి ఇప్తార్‌ విందు ఇచ్చి టీడీపీకి ఓటు వేయాలని ఆదేశించారన్నారు. ఆ తరువాతి రోజు నేను వేసిన రోడ్లపై నడుస్తున్నారు. నేనిచ్చిన పింఛన్లు తీసుకుంటున్నారు. నాకు ఓటు వేయరా అంటూ వ్యాఖ్యలు చేయడం ద్వారా ఈ ఉప ఎన్నికను మరింత ప్రతిష్టాత్మకంగా చంద్రబాబు తీర్చి దిద్దారు. ఉప ఎన్నికలు చాలా జరుగుతాయి. ఈ ఉప ఎన్నికకు చంద్రబాబు ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇచ్చారో ఒక్కసారి ఆలోచిస్తే అర్థమయ్యేది ఏంటంటే ..చంద్రబాబు పాలనపై ప్రజల అభిప్రాయాలు తెలుసుకునేందుకు ఇంతవరకు ఏ ఎన్నిక కూడా జరుగలేదు.  వైయస్‌ఆర్‌సీపీ నుంచి తెలుగు దేశం పార్టీలో చేరిన భూమా నాగిరెడ్డి మరణంతో ఈ ఎన్నిక అనివార్యంగా వచ్చింది. చంద్రబాబు ఎన్నిక పెట్టాలనుకుంటే పెట్టేవారు. అనివార్యంగా వచ్చిన ఎన్నికలో ప్రజల అభిప్రాయం తెలుస్తుందని, చంద్రబాబు దృష్ట పరిపాలన ప్రజలకు తెలుస్తుందని మొదటి నుంచి ఇప్పటి వరకు చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరుగెత్తాయి.  ఎన్ని ప్రలోభాలు పెట్టారు. నేను 1989 నుంచి రాజకీయాలను అతి సమీపంగా చూశాను. ఇన్ని ప్రలోభాలు పెట్టిన ఎన్నికలు ఎప్పుడు చూడలేదు. ఎంత డబ్బులు ఖర్చు చేశారు. 175 నియోజకవర్గాల్లో ఒక్క నంద్యాలలోనే వందల కోట్లు డబ్బు ఖర్చు చేశారు. విఫరీతమైన పదవులు కట్టబెట్టారు. ఎప్పుడు లేనంతగా రూ. 5 నుంచి 7 వేల వరకు ఓటర్లకు పంపిణీ చేశారు. పోలింగ్‌ జరుగుతున్న సందర్భంలో కూడా డబ్బులు పంపిణీ చేస్తున్నారు. చంద్రబాబు పేరుకు మాత్రమే అమరావతిలో కూర్చున్నారు కానీ, ఆయన మనసంతా నంద్యాలలోనే ఉంది. కామెండ్‌ రూమ్‌లో కూర్చోని ఎప్పటికప్పుడు సందేశాలు పంపించారు. డబ్బులు అక్కడ పంచండి..ఇక్కడ పంచండి అంటూ డైరెక్షన్‌ ఇచ్చారు. 

వందల కోట్లు ఎక్కడివి?
చంద్రబాబు నిన్న మీడియాతో నీతి, నియమాల గురించి ఎంత చక్కగా చెప్పారు. ఇన్ని వేల కోట్లు టీడీపీ నేతలకు ఎక్కడి నుంచి ఖర్చు చే స్తున్నారని అంబటి  ప్రశ్నించారు. అభివృద్ధి కార్యక్రమాల్లో లంచాలు తీసుకొని ఖర్చు చేస్తున్నారా?. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎన్ని దారుణాలు చేశారు.డబ్బులు లేవంటూనే నంద్యాలలో వందల కోట్లు ఖర్చు ఇతర ప్రాంతాల ఎమ్మెల్యేలను నంద్యాలకు పంపించారు. రాత్రిళ్లు రెండో విడత డబ్బులు పంపిణీ చేశారు. నకిలీ ముక్కు పుడకలు, డ్యామెజీ చీరలు పంపిణీ చే శారు. చివరి నిమిషంలో దొంగ ఓట్లు తీసుకొని వచ్చి వేయించే కార్యక్రమానికి తెర లేపారు. పోలీసులే టీడీపీ నేతలకు అండగా నిలబడుతున్నారు. ఇంతవరకు ఒక్కరిని కూడా పట్టుకోలేదు. శిల్పా మోహన్‌రెడ్డి ఇంటి మీద దాడి చేయించారు. అరాచకం సృష్టించి ఏదో విధంగా గెలవాలని చూస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. ఎన్నికలను ఖరీదైనవిగా మార్చిన ఘనత చంద్రబాబుదే. నంద్యాలలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ ఎమ్మెల్యే చనిపోతే ఆ స్థానాన్ని అడ్డదారిలో స్వాధీనం చేసుకునేందుకు చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేస్తున్నారు. వైయస్‌ఆర్‌సీపీ సీజీసీ సభ్యుడు రాజగోపాల్‌రెడ్డిపై టీడీపీ శ్రేణులు దాడులకు పాల్పడటం దారుణం. అమరావతిలో ఓ టీమ్‌ కూర్చోని అక్కడి నుంచే అధికార పార్టీ నేతలకు డైరెక్షన్‌ చేస్తున్నారని విమర్శించారు. యనమల రామకృష్ణుడు చాలా అత్యుత్సాహం చూపుతున్నారు. వైయస్‌జగన్‌పై ఎన్నికల కమిషన్‌ కేసు పెట్టాలట. ఆయన్ను కాకినాడ ప్రచారానికి రాకుండా అడ్డుకోవాలని మంత్రి యనమల దుర్మార్గంగా ఆలోచిస్తున్నారని మండిపడ్డారు. ఈ దుర్మార్గమైన విధానాన్ని ఏపీ ప్రజలు హర్శించకూడదని మనవి చేశారు. ఓటుకు వేలు వేలు ఖర్చు చేస్తున్నారు. చంద్రబాబుకు అభివృద్ధి పేరుతో ఓటు అడిగే దమ్ము, ధైర్యం లేదు. నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చిన ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. 
Back to Top