సుధీర్‌రెడ్డిని పరామర్శించిన ఎంపీ వైయస్‌ ఆవినాష్‌రెడ్డి

నిడుజివ్వి(ఎర్రగుంట్ల): వైయస్సార్‌ సీపీ జమ్మలమడుగు నియోజకవర్గ ఇన్‌చార్జ్  ఎం. సుధీర్‌రెడ్డిని కడప పార్లమెంట్‌ సభ్యులు వైయస్‌ ఆవినాష్‌రెడ్డి పరామర్శించారు.  నెలన్నర కిందట రోడ్డు ప్రమాదంలో సుధీర్‌రెడ్డి గాయపడిన సంగతి తెలిసిందే.  హైదరాబాదులో చికిత్స తీసుకున్న అనంతరం ఆయన  రెండు రోజులు కిందట స్వగ్రామమైన నిడుజివ్వికి వచ్చారు. ఈ సందర్భంగా అవినాష్‌రెడ్డి ఆయన ఇంటికెళ్లి పరామర్శించారు. ఆరోగ్యం బాగ చూసుకోవాలని, విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఆరోగ్యం కుదట పడిన తరువాతే అక్టోబర్‌ నుంచి పార్టీ కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్‌ సీపీ నాయకులు జిల్లా ప్రధాన కార్యదర్శి హరిప్రసాద్‌రెడ్డి, రైతు విభాగం జిల్లా నాయకులు ఎస్‌ ప్రసాద్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి జయరామక్రిష్ణరెడ్డి, మైనార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మహుబూబ్‌ వలి, స్థానిక నాయకులు గంగాక్రిష్ణారెడ్డి, జగన్‌మోహన్‌రెడ్డి, చిన్నవెంతర్ల కే మౌలాలిరెడ్డి, నాగేంద్రరెడ్డిలతో పాటు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

తాజా ఫోటోలు

Back to Top