విద్యావంతులను మోసం చేసిన చరిత్ర చంద్రబాబుదే

 
చిత్తూరు: సంక్షేమ పథకాల్ని గాలికొదిలేసిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైయ‌స్ఆర్‌సీపీ తాజా మాజీ ఎంపీ అవినాష్‌ రెడ్డి మండిపడ్డారు. అత్యధికాలం సీఎంగా పని చేశాననే ఎప్పుడూ గొప్పలు చెప్పుకునే చంద్రబాబు.. అసలు ఈ నాలుగేళ్లలో రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలంటూ ప్రశ్నించారు. రూ. 2వేల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి విద్యావంతులను మోసం చేసిన చరిత్ర చంద్రబాబుదేనని ఆయన విమర్శించారు. నాలుగేళ్లలో రాష్ట్రానికి లక్షా 60 వేల కోట్ల అప్పులు మిగల్చడం తప్ప చేసింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. కుప్పుం నుంచి వేలాది మంది కూలీలు బెంగళూరుకు వలస వెళ్లిపోతున్న సంగతిని చంద్రబాబు తెలుసుకోవాలన్నారు. ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేసుంటే కూలీలు వలస వెళ్లాల్సిన పరిస్థితి వచ్చేది కాదంటూ హితవు పలికారు.
 

తాజా ఫోటోలు

Back to Top