జిల్లా క‌లెక్ట‌ర్ అంటే టీడీపీ జిల్లా అధ్య‌క్షుడా..!


క‌డ‌ప‌) వైఎస్ఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ కేవీ ర‌మణ మీద ఎంపీ అవినాష్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఆయ‌న వ్య‌వ‌హార శైలి ఒక ఉన్న‌తాధికారి మాదిరిగా లేద‌ని, టీడీపీ జిల్లా అధ్యక్షుని మాదిరిగా ఉంద‌ని మండి పడ్డారు. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీల‌ను ప‌ట్టించుకోవ‌టం లేద‌ని ఆయ‌న అన్నారు. ప్ర‌జా ప్ర‌తినిధుల‌కు ఏ మాత్రం విలువ ఇవ్వ‌టం లేద‌ని ఆయ‌న అన్నారు. పోతిరెడ్డి పాడు ప్రాజెక్టుని దాదాపు 80 శాతం పూర్తి చేసి, దివంగ‌త నేత వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి క‌డ‌ప న‌గ‌రానికి నీరు అందించార‌ని గుర్తు చేశారు. కానీ రాష్ట్ర ప్ర‌భుత్వం మాత్రం ఆ ప్రాజెక్టుని పూర్తి చేయ‌టానికి ఏమాత్రం శ్ర‌ద్ధ చూప‌టం లేద‌ని మండి ప‌డ్డారు. 
Back to Top