వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన ఆటోడ్రైవ‌ర్లు


తూర్పుగోదావ‌రి : ప్రజాసంకల్పయాత్ర లో వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని ఆటో డ్రైవ‌ర్లు క‌లిశారు. 198వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా మామిడికుదురులో శ్రీ విజయదుర్గా ఆటో యూనియన్‌ సభ్యులు తమ సమస్యలు వివరిస్తూ వైయ‌స్‌ జగన్‌కు వినతిపత్రం సమర్పించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తమను ఆదుకోవాలని కోరుతూ కొన్ని అంశాలను వినతిపత్రంలో పేర్కొన్నారు. డీజిల్‌ రేట్లు అధికం కావడంతో కార్మికులకు సరైన కనీస వేతనం కూడా గిట్టుబాటు కావడం లేదని వైయ‌స్‌ జగన్‌కు ఆటో యూనియన్‌ బృందం తమ గోడును వెల్లబోసుకుంది. గత 8 ఏళ్లుగా సరైన ఆటోస్టాండ్‌ లేదని,  ఆ సౌకర్యం కల్పించేందుకు తమకు సాయం చేయాలని జననేతను కోరారు. వైయ‌స్‌ జగన్‌ను కలిసిన వారిలో మామిడికుదురు శ్రీ విజయదుర్గా ఆటో యూనియన్ అధ్యక్షులు కడలి శ్రీనివాసరావు, కార్యవర్గ సభ్యులు, తదితరులున్నారు.
Back to Top