ఆటోవాలా..హ‌ర్షాతిరేకాలు- క‌ర్నూలు న‌గ‌రంలో ఆటోడ్రైవ‌ర్ల భారీ ప్ర‌ద‌ర్శ‌న‌
- ఆటో న‌డిపిన వైయ‌స్ఆర్‌సీపీ న‌గ‌ర ఇన్‌చార్జ్ హాఫీజ్‌ఖాన్‌
క‌ర్నూలు: ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్క వృత్తిదారుడికి.. ప్రతి ఒక్క సామాజిక వర్గానికి అండగా ఉండే సోంత అన్నలా హామీలు ఇస్తున్నారు  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఈ నెల 14న ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా ఏలూరు బ‌హిరంగ స‌భ‌లో ఆటోడ్రైవ‌ర్ల‌కు వ‌రాల జ‌ల్లు కురిపించారు. సొంత ఆటో ఉన్న ప్రతి ఒక్కరికీ ఏడాదికి పదివేలు ఇస్తామన్న వైయ‌స్‌ జగన్ హామీపై ఆటోడ్రైవర్లు హర్షం వ్యక్తం చేశారు. శుక్ర‌వారం క‌ర్నూలు న‌గ‌రంలో వైయ‌స్ఆర్‌సీపీ న‌గ‌ర స‌మ‌న్వ‌య‌క‌ర్త హాఫీజ్‌ఖాన్ ఆధ్వ‌ర్యంలో న‌గ‌రంలో ఆటోడ్రైవ‌ర్లు భారీ ర్యాలీ నిర్వ‌హించారు. ముందుగా దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి విగ్ర‌హానికి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు. ఈ సందర్భంగా హాఫీజ్‌ఖాన్ ఆటో న‌డిపి ఆటోడ్రైవ‌ర్ల‌కు మ‌ద్ద‌తు తెలిపారు. ఆయ‌న మాట్లాడుతూ.. వైయ‌స్ఆర్‌సీపీ అధికారంలోకి రాగానే ఆటో కొనుగోలు చేసేవారికి పదివేల రూపాయల చొప్పున ఆర్ధిక సాయం చేస్తామ‌ని వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌క‌టించ‌డం సంతోష‌క‌ర‌మ‌న్నారు. ఆటోడ్రైవ‌ర్ల బాగోగులు ఏ పార్టీ, ఏ నాయ‌కుడు ఇంత‌వ‌ర‌కు ప‌ట్టించుకోలేద‌ని, మొట్ట‌మొద‌టి సారిగా వైయ‌స్ జ‌గ‌న్ ఆలోచించి మంచి నిర్ణ‌యం తీసుకున్నారన్నారు. ఇలా అన్ని వ‌ర్గాలు వైయ‌స్ఆర్‌సీపీ అధికారంలోకి రావాల‌ని ఆకాంక్షిస్తున్నాయ‌న్నారు. త‌ప్ప‌కుండా వైయ‌స్ జ‌గ‌న్ సీఎం అవుతార‌ని, రాజ‌న్న రాజ్యాన్ని తెస్తాన‌ని హాఫీజ్‌ఖాన్ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. కార్య‌క్ర‌మంలో క‌టారి సురేష్‌బాబు, కిషోర్‌, సంప‌త్‌, మౌలాలి, సూరి, మియాబాషా, బీమ‌న్న‌, ర‌వి, ఇస్మాయిల్‌, సుధాక‌ర్‌, గిరి త‌దిత‌రులు పాల్గొన్నారు. 
Back to Top