ఆటో డ్రైవర్ల కష్టసుఖాలు తెలుసుకున్న జననేత

తూర్పుగోదావరి: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌
పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కాసేపు ఆటోవాలాగా మారారు. ఆటో డ్రైవర్ల
డ్రెస్‌ వేసుకొని కార్మికుల కష్ట సుఖాలు అడిగి తెలుసుకున్నారు.  ఆటోల నిర్వహణ కోసం  ఏడాదికి రూ. 10 వేలు ఇస్తామని జననేత ప్రకటించిన
విషయం తెలిసిందే.. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో ప్రజా సంకల్పయాత్ర
చేస్తున్న వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఆటో కార్మికులు కలిసి వారి అభిమానాన్ని
చాటుకున్నారు. వెదిరేశ్వరంలో వైయస్‌ జగన్ను కలిసి కార్మికులు జ్ఞాపికను
బహూకరించారు. రూ. 10 వేల సాయం ప్రకటన ఎంతో చేయూత నందిస్తుందని వైయస్‌ జగన్‌కు
చెప్పుకున్నారు. 

Back to Top