వైయస్‌ జగన్‌ను కలిసిన ఆటోడ్రైవర్లుతూర్పు గోదావరి జిల్లా మాధవపట్టణానికి చెందిన ఆటో డ్రైవర్లు రామేశ్వరం వద్ద ప్రజా సంకల్ప యాత్రలో వైయస్‌ జగన్‌ను కలిశారు. నాగార్జున అనే ఆటోడ్రైవర్‌ తన ఖాకీ చొక్కాను తీసి వైయస్‌ జగన్‌కు తొడిగించారు. అభిమాన నేత తన చొక్కా వేసుకోవడంతో నాగార్జున ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.10 వేలు ఇస్తామని వైయస్‌ జగన్‌ చేసిన ప్రకటనపై ఆటోడ్రైవర్లు హర్షం వ్యక్తం చేశారు. తామంతా వైయస్‌ఆర్‌సీపీకి మద్దతుగా ఉంటామని, వైయస్‌ జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకుంటామని ఆటోడ్రైవర్లు పేర్కొన్నారు.
 
Back to Top