ఆటోడ్రైవర్ల హర్షం

– ప్రజా సంకల్ప యాత్రలో సమస్యల వెల్లువ
పశ్చిమ గోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో సమస్యలు వెల్లువెత్తున్నాయి. మంగళవారం పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో వైయస్‌ జగన్‌ పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా వైయస్‌ జగన్‌ను ఆటో డ్రైవర్లు కలిసి హర్షం వ్యక్తం చేశారు. ఏడాదికి రూ.10 వేలు ఆటోడ్రైవర్లకు ఇస్తానని వైయస్‌ జగన్‌ ప్రకటించిన హామీపై వారు కృతజ్ఞతలు తెలిపారు.  ఆర్టీఏ అధికారులు తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు. తెలంగాణ మాదిరిగా ఇన్సూరెన్స్‌ సౌకర్యం కల్పించాలని ఆటోడ్రైవర్లు కోరారు. ఈ సందర్భంగా వైయస్‌ జగన్‌ ఖాకీ డ్రస్‌ వేసుకొని ఆటో నడిపారు. ఆటో డ్రైవర్లకు జననేత భరోసా కల్పించారు. అలాగే జన్మభూమి కమిటీ అరాచకాలు ఎక్కువయ్యాయని డ్వాక్రా సంఘాల సభ్యులు వైయస్‌ జగన్‌కు ఫిర్యాదు చేశారు. ఫీజురీయింబర్స్‌మెంట్‌ సక్రమంగా అమలు కావడం లేదని విద్యార్థులు జననేత వద్ద మొరపెట్టుకున్నారు. వైయస్‌ రాజశేఖరరెడ్డి చలువతోనే బతికానని ధర్మరాజు అనే వ్యక్తి వైయస్‌ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.ప్రజల కష్టాలు వింటూ..వారికి భరోసా కల్పిస్తూ వైయస్‌ జగన్‌ ముందుకు సాగుతున్నారు.  
Back to Top