అత్యంత ప్రభావశీలి జగన్మోహన్ రెడ్డి

విజేతలే చరిత్ర గతిని నిర్దేశిస్తారన్నది జగమెరిగిన సత్యం. అసాధారణ కృషికి తోడు సమకాలీన సమాజంపై అత్యధికంగా ప్రభావాన్ని చూపించగలిగినవారే ఏ రంగంలోనైనా విజయం సాధించగలుగుతారు.
రాష్ట్రంలో అత్యంత ప్రభావశీల వ్యక్తుల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ శ్రీ వైయస్ జగన్మోహన్  రెడ్డి ఒకరు.

"ఇండియా టుడే" తాజా సంచికలో ఆంధ్రప్రదేశ్లో పదిమంది శక్తి మంతుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి తనయుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి మొదటి స్థానంలో నిలిచారు.

విజేతలే చరిత్ర గతిని నిర్దేశిస్తారన్నది జగమెరిగిన సత్యం. అసాధారణ కృషికి తోడు సమకాలీన సమాజంపై అత్యధికంగా ప్రభావాన్ని చూపించగలిగినవారే ఏ రంగంలోనైనా విజయం సాధించగలుగుతారు. విజేతలెప్పుడూ ప్రత్యేకంగా ఉంటారు. వారు విజేతలుగా మారే క్రమంలో ఎన్ని అవరోధాలు ఎదురుకావచ్చు. కానీ చివరకు అవన్నీ వారి ధాటికి తునాతనకలు కావలసిందే. విజేతలెపుడూ విజయం గురించి ఆలోచించరు. ఎందుకంటే వారు చేపట్టే పనులన్నీ విజయమే తుది లక్ష్యంగా ఉంటాయి.

తోటివారి అవసరాలనూ , ఆకాంక్షలనూ, ఆవేదనలను అర్ధం చేసుకోగలిన వారే విజేతలుగా నిలుస్తారు . సమస్యల పరిష్కారానికి నిజాయితీతో ప్రతిస్పందిచగల వ్యక్తులు మాత్రమే చుట్టూ ఉన్న వారిని ప్రభావితం చేయగల శక్తిని సంతరించుకుంటారు. ఆ క్రమంలో వారు మిగిలిన వారితో పోలిస్తే శక్తిమంతులుగా ఆవిర్భవిస్తారు..... అని 'ఇండియాటుడే' పత్రిక అత్యంత ప్రభావశీల వ్యక్తిగా శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డిని అభివర్ణించింది.

గతేడాది అంటే 2012 మే 27వ తేదీ నుంచి శ్రీ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ చంచల్‌గూడ జైలులో ఉన్నా రాష్ట్రంలో అధికార కాంగ్రెస్కు బలమైన సవాలుదారుగా మారారని 'ఇండియాటుడే' పత్రిక పేర్కొంది. జగన్ జనం మధ్య లేనప్పటికీ అత్యధిక మంది ఎమ్మెల్యేలపై తన ప్రభావాన్ని చూపిస్తున్నారంటూ తెలిపింది.

నిత్యం సాధారణ వస్త్రధారణతో ఉంటూ జనం పక్షాన పోరాడేందుకు సిద్ధమంటూ ప్రజలలో విశ్వాసాన్ని కలిగించారని 'ఇండియా టుడే' చెప్పింది. దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి రాష్ట్ర భవిష్యత్తు కోసం కన్న కలలను సాకారం చేయడమే లక్ష్యంగా శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని వివరించింది.

గతంలో 'ఇండియా టుడే' తన కథనంలో శ్రీ జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నా రాష్ట్ర రాజకీయాలతో పాటు, జాతీయ రాజకీయాల్లోనూ కూడా కీలకమైన వ్యక్తవుతారని పేర్కొన్న విషయం తెలిసిందే. మన రాష్ట్రం నుంచి అలా జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసే అవకాశం ఉన్న నేతలలో ఒక్క శ్రీ జగన్మోహన్ రెడ్డి పేరే ఉండడం విశేషం.

ఇదంతా ఒకవైపు ఉంటే 332 రోజులు జైలులో వుండి ప్రజలకు దూరంగా వున్నా, ప్రజలకు శ్రీ వైయ్ జగన్మోహన్ రెడ్డి  మీద ఆ ప్రేమ, ఆ అభిమానం, ఆ ఆప్యాయత ఏమాత్రం తగ్గలేదు సరికదా ఎన్నోరెట్లు పెరిగింది. ఎంత ఆపాలనుకున్నా కృష్ణుని పుట్టుకను కంసుడు ఆపలేకపోయినట్లే, క్రీస్తు పుట్టుకను హేరోదు ఆపలేకపోయినట్లే, శ్రీ జగన్మోహన్ రెడ్డి బయటకు రావడాన్ని ఎవ్వరూ ఆపలేరు. శ్రీ జగన్మోహన్ రెడ్డి విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు.    -పార్వతి (సాక్షి సౌజన్యంతో)

Back to Top