బాబు అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి మహిళలపై దాడులు

గుంటూరుః రాజధాని ప్రాంతంలో సొంత పార్టీకి చెందిన మైనారిటీ మహిళ జడ్పీచైర్ పర్సన్ జానీమూన్ పై మంత్రి రావెల కిషోర్ బాబు దాడి చేసి హతమార్చే పరిస్థితికి వచ్చారంటే...ఇక ప్రతిపక్ష నాయకులపై తెలుగుదేశం ప్రభుత్వం ఈరెండున్నరేళ్లలో ఏవిధమైన దారుణాలకు ఒడిగట్టిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. ఎవరైతే తమ అవినీతికి అడ్డం వస్తారో వారిని బెదిరించే కార్యక్రమాలు చంద్రబాబు అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి జరుగుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని అంబటి రాంబాబు అన్నారు. 

Back to Top