ముద్రగడ కుటుంబ సభ్యులపై దాడి దారుణం

 • కాపులను చీల్చాలని బాబు కుట్ర
 • తలుపులు పగులగొట్టి ముద్రగడను అరెస్టు చేస్తారా?
 • వాగ్ధానాలు నెరవేర్చాలని దీక్ష చేస్తే కొడతారా?
 • బాబు మాటవినని మీడియా ప్రసారాలు ఆపివేయాలని ఎంఎస్‌ఓలపై ఒత్తిడి
 • కాపులకు వైయస్‌ఆర్‌ దేవుడే
 • ముద్రగడకు వైయస్‌ఆర్‌ సీపీ సంపూర్ణ మద్దతువైయస్‌ఆర్‌ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు

 • హైదరాబాద్‌: కాపు సామాజిక వర్గానికి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను నెరవేర్చమని కోరుతున్న కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం కుటుంబ సభ్యులపై దాడి చేయడం దారుణమని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ముద్రగడ దీక్షపై చంద్రబాబు సర్కార్‌ చేసిన దాyì ని ఆయన ఖండించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. గతంలో చంద్రబాబు కులాల మధ్య చిచ్చుపెట్టారని, ఇప్పుడు కులాన్ని చిల్చీ అధికారం శాశ్వతం చేసుకోవాలని కుట్రలు పన్నుతున్నారన్నారు.  నీతి నిజాయితితో కాపుల కోసం పోరాటం చేసే ముద్రగడ ఇంటి తలుపులు పగులగొట్టి ఆయనను అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు. మాజీ మంత్రి తనయుడ్ని కుక్కను కొట్టినట్లుగా కొట్టుకుంటూ తీసుకెళ్లారని ఫైరయ్యారు. ముద్రగడ సతీమణిపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారని దుయ్యబట్టారు. చంద్రబాబు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుండా దాడులకు దిగుతున్నారని కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని, ప్రతిఏటా కాపుల రిజర్వేషన్‌కు వెయ్యి కోట్లు చొప్పున రూ. 5 వేల కోట్లు కేటాయిస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు వాగ్ధానం చేశారని చెప్పారు. కాపు కులస్తులు ఇచ్చిన వాగ్ధానాన్ని నిలుపుకోవాలని మాత్రమే డిమాండ్‌ చేస్తున్నారని చెప్పారు. చంద్రబాబు కాపునేత ముద్రగడ పద్మనాభంపై జరుగుతున్న దాడులను ఎవరికీ తెలియకూడదని మీడియాను కూడా అక్కడికి అనుమతించలేదన్నారు. అక్కడున్న కొంత మంది సెల్‌ఫోన్‌లలో పోలీసులు ముద్రగడ కుటుంబంపై చేసిన దౌర్జన్యాన్ని చిత్రీకరించారని, అవి సోషల్‌ మీడియా ద్వారా ప్రజలందరికీ చేరాయన్నారు. పోలీసులు ముద్రగడ కుటుంబంపై దాడి చేసిన వీడియోలను ఆయన మీడియాకు చూపించారు.

  పోలీసులు అప్పుడేమయ్యారు
  ముద్రగడ పద్మనాభం దీక్ష చేస్తుంటే భారీగా ఆయన ఇంటి ముందు మోహరించిన పోలీసులు తునిలో అంతపెద్ద ఘటన జరుగుతుంటే ఏమైపోయారని ప్రశ్నించారు. తుని ఘటనలో రైలు, రెండు పోలీస్‌ స్టేషన్‌ దగ్ధమవుతుంటే పోలీసులు ఎందుకు రియాక్ట్‌ కాలేదని మండిపడ్డారు. చంద్రబాబు ముందు పథకం ప్రకారమే కుట్రపూరితంగా, విషపూరితంగా పోలీస్‌ బందోబస్తు లేకుండా ఒక అరాచకాన్ని సృష్టించడానికి కావాల్సిన పరిస్థితులను క్రియేట్‌ చేశారన్నారు. తన సొంత మనుషులను పంపించి రైలు, పోలీస్‌ స్టేషన్‌లను చంద్రబాబే తగలబెట్టించారనడానికి ఎలాంటి సందేహం లేదని అంబటి చెప్పారు. పోలీసులను ఘటన స్థలానికి అనుమతించకుండా కుట్రపూరిత చర్యలకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు తునిలో అంతటి నేరాలు కావడానికి పరిస్థితులను కల్పించింది చంద్రబాబేనని విమర్శించారు. తూర్పు, పశ్చిమగోదావరి జిల్లా ప్రజలు శాంతస్వభావులు ఎక్కడ నుంచో రాయలసీమ నుంచి వచ్చిన వ్యక్తులు ఈ దహన కాండకు పాల్పడ్డారని చెప్పి ఈ రోజు ఎందుకు ఈ రెండు జిల్లాల్లోని ప్రజలను అన్యాయంగా అరెస్టు చేస్తున్నారని ప్రశ్నించారు. తుని ఘటనను వైయస్‌ఆర్‌ సీపీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌పై నెట్టేప్రయత్నం చేసి పార్టీనేత కరుణాకర్‌రెడ్డి వచ్చి రాయబారం నడిపారని చెప్పారు. శాసనసభలో అంబటి వెళ్లి రెక్కి చేశారని చెప్పి ఈ రోజు అమాయకులను ఎందుకు అరెస్టు చేస్తున్నారని నిలదీశారు. మాటమీద ఎందుకు నిలబడటం లేదని మండిపడ్డారు. కుట్రపూరితంగా బ్లాక్‌మెయిర్‌ స్ట్రేటజీతో చేస్తున్నారని స్పష్టంగా అర్థమవుతుందన్నారు. ముద్రగడ పద్మనాభం చెడ్డపేరు కల్గిన వ్యక్తి కాదని గుర్తు చేశారు. మంత్రిగా పనిచేసి కూడా లంచాలు తీసుకోకుండా పనిచేసిన వ్యక్తి చంద్రబాబు ఇచ్చిన వాగ్ధానాలను నెరవేర్చుకొమని కోరుతున్నారు కానీ గొంతెమ్మ కోరికలు కోరడం లేదని పేర్కొన్నారు. ఫిబ్రవరిలో ముద్రగడ దీక్ష చేస్తుంటే ఎందుకు తలుపులు పగలగొట్టలేదని ప్రశ్నించారు. దీక్ష విరమింపజేయాలని మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే బోండా ఉమా, కళా వెంకట్రావులను రాయబారానికి ఎందుకు పంపించారని చంద్రబాబును నిలదీశారు.కాపులను బీసీల్లో చేర్చుతారని హామీ ఇచ్చిన మాట వాస్తవం కాదా అని మండిపడ్డారు.  కాపులను బీసీల్లో చేర్చితే చంద్రబాబు కాళ్లు కడిగి నెత్తిన చల్లుకుంటానని చెప్పిన ముద్రగడపై ఇలాంటి దాడులకు తెగబడటం దారుణమన్నారు. చిత్తశుద్ధితో పోరాడాలనే భావనతోనే ముద్రగడ పద్మనాభం మాట్లాడారని చెప్పారు. అలాంటి వ్యక్తినపై మీరు చేసిన అరాచకం ధర్మమేనా అని ప్రశ్నించారు. 
  నేరం జరుగుతున్నట్లు కాదా..?
  ముద్రగడ పద్మనాభం ఇంటి వద్ద ఏం జరుగుతుందని ప్రజలకు తెలియనివ్వకుండా ఛానెళ్లను కూడా రాన్విలేదంటే అక్కడ నేరం జరుగుతున్నట్లు కాదా అని అంబటి చంద్రబాబును నిలదీశారు.  ముద్రగడను అరెస్ట్‌ చేసే సమయంలో రాష్ట్ర ప్రజలు చూడనివ్వకుండా ఛానెళ్లు కూడా రానివ్వలేదని మండిపడ్డారు. చంద్రబాబు మాట వినని ఛానెళ్లు సాక్షి, ఇతర మూడు ఛానెళ్లు ప్రసారం చేస్తే వాటి ప్రసారాలు నిలిపివేయాలని పోలీస్‌ ఉన్నతాధికారులు ఎస్పీలు, జాయింట్‌ కలెక్టర్‌లతో ఎంఎస్‌ఓలపై ఒత్తిడి తీసుకువచ్చారన్నారు. చంద్రబాబుకు అదృష్టం బాగుండి ముఖ్యమంత్రి అయ్యారు ముద్రగడకు ఏం తక్కువ అని వ్యాఖ్యానించారు. ముద్రగడ కుమారుడు గిరి లోకేష్‌ కంటే గొప్పవాడని చెప్పారు. చంద్రబాబు ఎన్నికల ముందు కాపులను బీసీల్లో చేర్చుతామన్నారు కాబట్టే పోరాటం చేస్తున్నారని చెప్పారు. పెడతామంటే వెళ్లాం కానీ కొడతామంటే ఊరుకోమని చందరబాబును హెచ్చరించారు.

  కాపులపాలిట బాబు రాక్షసుడు
  కాపుల సమస్యలను తెలుసుకొని వారి న్యాయమైన డిమాండ్‌లను పరిష్కరించారు కాబట్టే దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి కాపుల పాలిట దేవుడయ్యారని అంబటì  రాంబాబు అన్నారు. ఏం చేయని వైయస్‌ఆర్‌ను దైవంలా భావిస్తున్నారన్నారని.. అన్ని చేస్తున్న నేను రాక్షసుడిని అయిపోయానని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఆయన ఘాటుగా స్పందించారు. వైయస్‌ఆర్‌ హయాంలో కూడా ముద్రగడ దీక్షలు చేశారని, కానీ మీ మాదిరిగా తలుపులు పగలగొట్టించి అరెస్టు చేయించలేదన్నారు. కాపుల న్యాయపరమైన డిమాండ్‌లను తీర్చారు కాబట్టే ఆయన దైవ్యం అయ్యారని, కాపులను చిత్రహింసలకు గురిచేస్తున్న నువ్వు కాపుల పాలిట రాక్షసుడికి అవుతున్నావని ఎద్దేవా చేశారు. కులాలతో తగదాలు పెట్టుకోవద్దని అంబటి హితవుపలికారు. వంగవీటి హత్య తరువాత మన నాయకుడు ఎన్టీఆర్‌ లాంటివారే ఓటమిపాలయ్యాడని గుర్తుచేశారు. కాపుల వాగ్ధానాలను నెరవేర్చకపోగా వారిపై దాడులు చేస్తున్న చంద్రబాబు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పారు.  పార్లమెంట్‌లో జరిగేది ఏం తెలియకుండా టీవీ ప్రసారాలన్ని నిలిపివేసి రాష్ట్రం విడగొట్టిన కాంగ్రెస్‌కు పట్టిన గతే చంద్రబాబుకు పడుతుందని హెచ్చరించారు. అరెస్టులు, అణచివేతలు ఐక్యతను మరింత పెంపొందిస్తాయని, పోలీసులు మీ చేతుల్లో ఉన్నారని ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, అధికారం, పోలీసులు శాశ్వతం కాదని సూచించారు.

  బాక్స్‌...
  కాపులను బీసీల్లో చేర్చాలని డిమాండ్‌తో దీక్ష చేస్తున్న ముద్రగడను అతిక్రూరంగా, పాశవికంగా చంద్రబాబు అరెస్ట్‌లు చేయించడాన్ని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పూర్తిగా ఖండిస్తోందని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. ఎన్నికల ముందు చంద్రబాబు ప్రతి కులానికి, వర్గానికి ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే ఆ వర్గానికి వైయస్‌ఆర్‌ సీపీ అండగా ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలో ఏ ఉద్యమం చేసినా వారికి అండగా ఉంటామన్నారు. ఏ నేరాలు చేసినా వాటి వెనుక వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉన్నారని ఆరోపించడం చంద్రబాబు సర్కార్‌కు అలవాటైపోయిందన్నారు. ఆసుపత్రిలో కూడా దీక్ష చేస్తున్న ముద్రగడను మేం అభినందిస్తున్నామని, రేపు పార్టీ ప్రతినిధుల బృందం రాజమండ్రికి వెళ్లి ముద్రగడను పరామర్శించి, ఆయనకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మద్దతు ఉంటుందని ప్రకటించనున్నట్లు చెప్పారు.
Back to Top