వైయ‌స్ఆర్‌సీపీ నేత‌పై దౌర్జన్యం

విజయవాడ: కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం తేలప్రోలు  గ్రామానికి చెందిన వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కుడు వింత శ్రీనివాసరెడ్డిపై గ్రామ సర్పంచ్ భర్త రాము దౌర్జన్యానికి దిగారు. కారుతో ఢీకొట్టి చంపుతానంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. సర్పంచ్ భర్త తీరుపై వైయ‌స్ఆర్‌సీపీ  కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాము కారు ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు.  

Back to Top