వైయ‌స్సార్సీపీ నేత‌ల‌పై దాడి

పాయకరావుపేట: విశాఖ జిల్లా పాయకరావుపేట మండలం పాల్మన్‌పేటలో కొంతమంది దుండగులు బీభత్సం సృష్టించారు.  గుర్తు తెలియని వ్యక్తులు గ్రామంలోకి ప్రవేశించి కర్రలతో దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీకి చెందిన గ్రామ సర్పంచి, ఎంపీటీసీ సహా నలబై మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దుండగులను తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సీనియ‌ర్‌ మంత్రి అనుచరులుగా అనుమానిస్తున్నారు.
Back to Top