పెచ్చుమీరుతున్న పచ్చనేతల అరాచకాలు

కర్నూలుః అధికార పార్టీ అరాచకాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. తమకు అడ్డొస్తే ఎంతటి వారినైనా వదిలేది లేదనే సంకేతాలిస్తూ.. ప్రజలను భయభ్రాంతులకు లోను చేస్తున్నారు. కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మధు అనుచరులు చేసిన వీరంగం అంతా ఇంతా కాదు. కారుకు అడ్డొచ్చారనే చిన్న కారణంతో తండ్రీ కుమారుడిని బెల్టుతో చితకబాదడం.. కుమారుడిని వదిలిపెట్టండని తండ్రి కాళ్లావేళ్లా పడినా కనికరించకపోవడం చూస్తే.. ఆ పార్టీ ప్రజల్లోకి ఎలాంటి సందేశం పంపుతుందో అర్థమవుతోంది. టీడీపీ నేతల దాదాగిరిపై స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. అధికారగర్వంతో వ్యవహరిస్తున్న టీడీపీకి రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం తప్పదని హెచ్చరిస్తున్నారు. 
 
Back to Top