బాధితులను పరామర్శించిన తోపుదుర్తి

ఆత్మకూరుః పాపంపల్లి గ్రామంలో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న నాగరాజు రెడ్డిని  రాప్తాడు నియోజకవర్గ సమస్వయ కర్త తొపుదుర్తి ప్రకాష్‌రెడ్డి తండ్రి తొపుదుర్తి రామిరెడ్డి  మండల వైయస్సార్‌సీపీ నాయకులతొ కలసి పరామర్శించారు. అధైర్యపడొద్దు అండగా ఉంటామని భరోసా కల్పించారు . అనంతరం మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో సోమవారం రాత్రి కండెక్టర్‌ ఈశ్వరయ్య గెండెనొప్పితొ మరణించగా వారి కుటుంబాన్ని ఆత్మారామిరెడ్డి పరామర్శించారు. ఈశ్వరయ్య మృత దేహానికి పూల మాల వేసి నివాలులర్పించారు. వీరి వెంట వైయస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ వడ్డుపల్లి నరసింహారెడ్డి , జిల్లా అధికార ప్రతినిథి చంద్రశేఖర్‌రెడ్డి , జిల్లా కార్యదర్శి వెంకట్రాముడు ,సింగల్‌ విండో ప్రసిడెంట్‌ వాసుదేవరెడ్డి,మండల రైతు సంఘ నాయకుడు ఈశ్వరరెడ్డి , నాయకులు సద్దికూటి వెంకట్రామిరెడ్డి ,నరసింహా, మాదన్న, మాజీ డీలర్‌ సోము,గొవిందు తదితరులు ఉన్నారు.
 
Back to Top