ప్రతి ఏటా మహానేత వర్థంతిన నాటక ప్రదర్శన

ఆత్మకూరు: పేదల సంక్షేమానికి అహర్నిశలు శ్రమించిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి సేవలను ఆత్మకూరు మండల వాసులు నేటికీ గుర్తు చేసుకుంటున్నారు. మహానేత స్మారకార్థం ప్రతి ఏటా ఆయన వర్ధంతి నాడు ఉచిత పౌరాణిక నాటక ప్రదర్శనతో పాటు పెద్ద ఎత్తున అన్నదానం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ ఏడాది కూడా పౌరాణిక నాటక ప్రదర్శనకు రంగం సిద్ధం చేశారు. శనివారం రాత్రి ఆత్మకూరు. బి.యాలేరు గ్రామాల్లో ఉచిత నాటక ప్రదర్శనలతో పాటు అన్నదానం చేయనున్నారు.

ప్రతి ఏటా అన్నదానం
ప్రతి ఏటా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి వర్ధంతి నాడు అన్నదానం చేస్తున్నాం. ఇందుకు మహానేత అభిమానాలు భారీగా చందాలు ఇస్తున్నారు. అన్నదానంతో పాటు పలు సేవా కార్యక్రమాలను చేపడుతుంటాం.
- చెన్నారెడ్డి, ఆత్మకూరు

రాత్రంతా జాగారం
వైయస్సార్‌ మన మధ్య భౌతికంగా లేకపోయినా.. ఆయన అందించిన సేవల ద్వారా మా గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. అందుకే ఆయన వర్ధంతినాడు రాత్రంతా జాగారణ చేస్తుంటాం. ఇందుకు ఆత్మకూరులోని పోతప్ప కట్ట వద్ద ఉచిత నాటక ‍ప్రదర్శన ఏర్పాటు చేస్తుంటాం. ‍ప్రతి ఏటా ఆనవాయితీగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం.
- జయరామిరెడ్డి, ఆత్మకూరు

వైయస్సార్‌ అడుగు జాడల్లో నడుస్తాం
ప్రజలకు వైయస్సార్‌ ఎనలేని సేవలను అందించారు. ఆయన ఆడుజాడల్లోనే నడుస్తూ ప్రజలకు ఆయన వర్థంతి రోజు పలు సేవా కార్యక్రమాలు చేపడుతుంటాం.
- శ్రీరామిరెడ్డి, ఆత్మకూరు
Back to Top