అత్యాచార ఘ‌ట‌న‌పై పార్ల‌మెంటులో ప్ర‌శ్నిస్తా..ఎంపీ బుట్టా రేణుక‌

క‌ర్నూలు : చిన్నారిపై పాశ‌వికంగా లైంగిక దాడి జ‌రిపిన వ్య‌క్తికి శిక్ష
ప‌డేలా పార్ల‌మెంటులో తాను పోరాడ‌తాన‌ని ఎంపీ బుట్టా రేణుక అన్నారు.
క‌ర్నూలు న‌గ‌రంలో ఈ నెల 18న అత్యాచారానికి గురై క‌ర్నూలు ప్ర‌భుత్వ
స‌ర్వ‌జ‌న వైద్య శాల‌లో చికిత్స పొందుతున్న ఏడేళ్ల చిన్నారిని ఎంపీ బుట్టా
రేణుక ప‌రామ‌ర్శించారు. ఈ ఘ‌ట‌న తాలుకు పూర్వాప‌రాల్ని అడిగి
తెలుసుకొన్ఆరు. కుటుంబ స‌భ్యుల‌కు ఆమె ధైర్యం చెప్పారు. త‌ర్వాత మీడియాతో
మాట్లాడుతూ.. నిర్భ‌య చ‌ట్టం అమలు లో ఉన్నా, కానీ బాలిక‌లు, మ‌హిళ‌ల‌పై
లైంగిక దాడులు ఆగ‌టం లేద‌ని రేణుక అన్నారు. నిందితుల్ని క‌ఠినంగా శిక్షించే
వ్య‌వ‌స్థ‌లు ఉండాల‌ని ఆమె అభిప్రాయ ప‌డ్డారు.

Back to Top