వైయ‌స్ జ‌గ‌న్‌కు 'ఆటా' ఆహ్వానంఅనంత‌పురం:  అమెరికా తెలుగు అసోసియేషన్ వేడుకలకు హాజరు కావాలని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి ఆసోసియేష‌న్ నాయ‌కులు ఆహ్వానం అంద‌జేశారు. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా అనంత‌పురం  జిల్లా క‌దిరి నియోజ‌క‌వ‌ర్గంలో పాద‌యాత్ర నిర్వ‌హిస్తున్న వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని మ‌ధ్యాహ్న భోజ‌న విరామ స‌మ‌యంలో  అమెరికన్ తెలుగు అసోసియేషన్   అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి, భువనేశ్ బుజాల, వేణు రెడ్డి, హరి లింగాల త‌దిత‌రులు కలిసి సంఘీభావం తెలిపారు.  రాష్ట్రంలో ప్రజల సమస్యలను ఎదుర్కోవడంలో వైయ‌స్ జ‌గ‌న్ చేస్తున్న‌ కృషిని ఆటా స‌భ్యులు ప్రశంసించారు. 
Back to Top