అశ్వారావుపేటలో షర్మిల పాదయాత్ర

ఖమ్మం, 07 మే 2013:

దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర మంగళవారం అశ్వారావుపేట నియోజకవర్గంలో సాగుతుంది. ఉదయం పెనగడప గ్రామం నుంచి శ్రీమతి షర్మిల పాదయాత్రను  మొదలుపెట్టారు. అంబేద్కర్‌నగర్‌, తిప్పనపల్లి, ఇంద్రనగర్‌ కాలనీ మీదుగా చండ్రుగొండ చేరుకుంటారు. ఇక్కడ షర్మిల బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం అయ్యనపాలెం మీదుగా పాదయాత్ర కొనసాగుతుంది. 141వ రోజైన ఇవాళ మొత్తం 11.9 కిలోమీటర్ల మేర షర్మిల పాదయాత్ర చేయనున్నారు.

Back to Top