అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ప్రతిపక్షం గొంతు నొక్కే ప్రయత్నం చేసింది. సభ ప్రారంభమవగానే అసెంబ్లీ కలాం మృతికి సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఆర్వాత పుష్కరఘాట్, ప్రత్యేక హోదా కోసం మరణించిన మృతులకు తీర్మానం ప్రవేశపెట్టడంతో వైఎస్ జగన్ అభ్యంతరం చెప్పారు. వారి మృతులకు ప్రభుత్వమే కారణమని జగన్ సభలో నిలదీశారు. దీంతో, పదే పదే మైక్ కట్ చేసి జగన్ ను మాట్లాడనీయకుండా ఆటంకం కలిగించారు. <br/>సంతాప తీర్మాన సమయంలో ప్రతిపక్ష నేతకు మాట్లాడే అవకాశం ఇవ్వడం సంప్రదాయం. కానీ అవేమీ లేకుండా తీర్మానాలను ఆమోదింపజేసుకోవడం బాబుకే చెల్లింది. ప్రజాసమస్యలపై వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేయడంతో టీడీపీ నేతలు అంతర్మథనంలో పడిపోయారు.