అసెంబ్లీ అంటే అంత అలుసా...!


*చ‌ట్ట స‌భ‌ల్ని గౌర‌వించిన అల‌నాటి పెద్దలు
*దివంగ‌త మ‌హానేత వైఎస్సార్ హ‌యంలో క్ర‌మం త‌ప్ప‌కుండా న‌డ‌చిన అసెంబ్లీ
*ఇప్పుడు అసెంబ్లీ స‌మావేశాల‌కు భ‌య‌పడుతున్న తెలుగుదేశం
*ఐదు రోజుల్లో అసెంబ్లీ స‌మావేశాల్ని ముగించే కుట్ర‌

హైద‌రాబాద్‌: ప్ర‌జాస్వామ్యంలో చ‌ట్ట స‌భ‌ల‌కు ఉండే ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. ప్ర‌జ‌ల‌కు ఉండే స‌మస్య‌లు, ప్ర‌జ‌ల వాణిని తెలియ చెప్పే వేదిక‌. కానీ, చంద్ర‌బాబు ప్ర‌భుత్వానికి మాత్రం చ‌ట్ట స‌భ‌ల మీద ఏమాత్రం గౌర‌వం లేదు. పైగా ప్ర‌తిప‌క్షాలు నిల‌దీస్తాయ‌నే భ‌యం వెంటాడుతుండ‌టంతో అసెంబ్లీ స‌మావేశాల్ని చుట్టేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.

దివంగ‌త వైఎస్సార్ హ‌యంలో చ‌ర్చ‌లు
దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి హ‌యంలో చ‌ట్ట స‌భ‌ల‌కు చాలా ప్రాధాన్యం ఇచ్చేవారు. క్ర‌మం త‌ప్ప‌కుండా అసెంబ్లీకి హాజ‌రు కావ‌టంతో పాటుగా ప్ర‌తిప‌క్షాల అభ్యంత‌రాలు, వాద‌న‌ల్ని వినేవారు. ప్ర‌భుత్వం త‌ర‌పున ప్ర‌క‌ట‌న‌లు, విధాన నిర్ణ‌యాల్ని అసెంబ్లీ వేదిక‌గా ప్ర‌క‌టించిన సంద‌ర్భాలు ఎన్నో ఉన్నాయి. అప్ప‌ట్లో అసెంబ్లీలో వైఎస్సార్ చేసిన ప్ర‌సంగాల్ని రాష్ట్ర‌మంతా ఆస‌క్తిగా ఆల‌కించేవి.

భ‌యం భ‌యంగా చంద్ర‌బాబు
ముఖ్య‌మంత్రిగా చంద్ర‌బాబు ఈసారి గద్దె నెక్కిన‌ప్ప‌టి నుంచీ ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల్ని గాలికి వ‌దిలేశారు. ప్ర‌ధాన హామీలు అయిన రైతు రుణ‌మాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ, నిరుద్యోగుల‌కు ఉపాధి, ప్ర‌త్యేక హోదా, గృహ నిర్మాణాలు అనే అంశాల్లో జ‌నాన్ని పూర్తిగా ముంచేశారు. రాజ‌ధాని అమ్మ‌కాలు, సింగ‌పూర్ లావాదేవీల్లో పూర్తిగా మునిగిపోయారు. చంద్ర‌బాబు త‌ప్పిదాల మీద గ‌డ‌చిన అసెంబ్లీ స‌మావేశాల్లో బాధ్య‌త‌గల ప్ర‌తిప‌క్ష నేత‌గా వైఎస్ జ‌గ‌న్ గ‌ట్టి పోరాటాన్ని చేశారు. అడుగడుగునా ప్ర‌భుత్వ త‌ప్పిదాల్ని ఎత్తి చూపుతుంటే బిత్త‌ర‌పోయి, స‌భ‌ను ప‌క్క దారి ప‌ట్టించ‌ట‌మే వ్యూహంగా ప‌నిచేసింది.

ఐదు రోజుల్లో సమావేశాలు ముగించే కుట్ర‌

ఈ సారి అసెంబ్లీ స‌మావేశాలు ఎక్కువ రోజులు జ‌రిగితే తిరిగి ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ ను త‌ట్టుకోవ‌టం క‌ష్ట‌మ‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది. ఓటుకి కోట్లు, సింగ‌పూర్ అమ్మ‌కాలు వంటి అనేక అంశాల్ని లేవ‌నెత్తే అవ‌కాశం ఉన్నందున అసెంబ్లీ స‌మావేశాల్లో దొరికి పోతామ‌ని అర్థం అయింది. దీంతో ప్ర‌భుత్వం ప‌లాయ‌న మంత్రాన్ని ప‌ఠిస్తోంది. ఐదు రోజుల్లోనే అసెంబ్లీ స‌మావేశాల్ని చుట్టేసి బ‌య‌ట ప‌డేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. పైగా దివంగ‌త మహానేత వైఎస్సార్ చిత్ర‌ప‌టాన్ని తొల‌గించ‌టం వంటి చ‌ర్య‌ల ద్వారా క‌వ్వింపు చ‌ర్య‌ల‌కు దిగుతోంది. చౌక బారు ఎత్తుగ‌డ‌ల‌తో తప్పించుకొనేందుకు ప్ర‌య‌త్నిస్తోంది.

Back to Top