ప్ర‌జా వాణి వినిపిస్తున్న వైఎస్సార్‌సీపీ

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి.  సమావేశాలు  ఐదురోజుల పాటు మాత్రమే నిర్వహించడాన్ని వైఎస్సార్సీపీ తప్పుబట్టింది. 15 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు కొనసాగించాలని బీఏసీ సమావేశంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ప్రజాసమస్యలపై చర్చించేందుకు సమావేశాలను పొడిగించాల్సిందేనని పట్టుబట్టింది. సమావేశాలు ఎక్కువ రోజులు జరిగితే  ఎక్కడ తమ అవినీతి బాగోతం బయటపడుతుందోనని పచ్చపార్టీ వణుకుతోంది. సభలో ప్రతిపక్షాన్ని ఎదుర్కోలేకే  సమావేశాలను పొడిగించేందుకు నిరాకరించింది.

సోమ‌వారం ఉదయం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు గన్ పార్క్ నుంచి అసెంబ్లీ వరకు పాదయాత్రగా వెళ్లారు. అసెంబ్లీలో ప్రభుత్వ పాలనను ఎండగట్టి ప్రజాసమస్యలపై పోరాటానికి నిర్ణ‌యించారు. ప్రత్యేక  హోదా డిమాండ్, భూసేకరణ రగడ, ప్రభుత్వ పథకాల్లో అవినీతి, ఓటుకు నోటు కేసు సహా అనేక అంశాలపై ప్రభుత్వాన్ని నిండుసభలో నిలదీస్తారు. బాబు ప్రజావ్యతిరేక పాలనను జనం ముందుకు తీసుకెళ్లేందుకు నిగ్గతీసి అడుగుతారు. 

ప్రత్యేక హోదాపై తీర్మానం చేయాలని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి  అసెంబ్లీలో నినదించారు. ఇదే విషయంపై వైసీపీ ఎమ్మెల్యేలు స్పీకర్  పోడియం వద్ద ఆందోళన చేపట్టారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని ఎమ్మెల్యేలు నినదించారు. తీర్మానం చేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని జగన్ అన్నారు. కేంద్రంలో టీడీపీ మంత్రులను ఉపసంహరించుకుంటేనే తీర్మానానికి బలం చేకూరుతుందన్నారు . 
Back to Top